బాహుబలి ప్రకంపనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సినిమా గురించి ఇంటా బైటా, ఊరూ వాడా మార్మోగిపోతోంది. అంతేనా ప్రముఖులంతా ఈ సినిమాని క్యూలో కూచుని మరీ వీక్షిస్తున్నారు. టిక్కెట్లు ప్రత్యేకంగా బుకింగ్ చేయించుకుని కుటుంబ సమేతంగా వెళ్లి చూసొస్తున్నారు.
భారతదేశ చరిత్రలోనే ఇలాంటి సినిమా ఇంతవరకూ రాలేదని అందరూ పొగిడేస్తున్నారు. ఇటీవలే తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ థియేటర్ లో బాహుబలి చిత్రాన్ని చూసి, వారెవ్వా అద్భుతం అంటూ కితాబిచ్చారు. ఇంతకుముందే చంద్రబాబు, నాయని, వెంకయ్య నాయుడు వంటి ప్రముఖులంతా భళా బాహుబలీ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.
ఇప్పుడు వంతు ఏకంగా దేశ ప్రధానికి వచ్చింది. నరేంద్ర మోదీని నిన్నటిరోజున ప్రభాస్, కృష్ణంరాజు అండ్ ఫ్యామిలీ వెళ్లి ఢిల్లీలో కలిశారు. మోదీ ఎంతో ఎగ్జయిట్ అయ్యారు. నేను 'బాహుబలి ప్రభాస్ ని కలిశాను' అంటూ అధికారికంగా ట్విట్టర్ లో ఓ ఫోటో ని కూడా పోస్ట్ చేశారాయన. అంతేనా బాహుబలి చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించడానికి రెడీ అవుతున్నారాయన.
ఇదంతా చూస్తుంటే తెలుగువాడి స్టామినా ఎంత పెద్ద స్థాయికి ఎదిగిందో అన్న గర్వం మనకు కలగకుండా ఉండదు. ఇదంతా జక్కన్న వల్లే సాధ్యమైంది. హ్యాట్సాప్ టు రాజమౌళీ..