ఒక స్టార్ హీరో ఒక సినిమా కోసం నాలుగేళ్లకు పైగా వెచ్చించడం అన్నది అనూహ్యమైన విషయం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆ సాహసమే చేశాడు. ‘బాహుబలి’ రెండు భాగాలుగా వస్తున్నప్పటికీ నిజానికి అది ఒకే సినిమా. నాలుగేళ్లకు పైగా అతను ‘బాహుబలి’గానే ఉంటున్నాడు. ఫస్ట్ పార్ట్ తర్వాత ఏడెనిమిది నెలలు గ్యాప్ వచ్చినా అతను మరో సినిమా చేయలేదు. బాహుబలిగా అతను ఎంతగా అలరించినప్పటికీ.. ఈ నాలుగేళ్లలో మరో సినిమా చేయకపోవడం అభిమానులకు నిరాశ కలిగించిన విషయమే. ఐతే ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఆడియో వేడుకలో మాట్లాడుతూ.. ఇకపై ఏడాదికి రెండు చొప్పున సినిమాలు చేస్తాననడం ఫ్యాన్స్ కు ఎక్కడ లేని ఉత్సాహం తెచ్చింది.
నిజంగా అన్న మాటను నిలబెట్టుకుని ఏడాదికి రెండు సినిమాలు చేస్తే సౌత్ ఇండియాలోనే అత్యధిక ఆదాయం పొందే హీరోల్లో ఒకడిగా నిలుస్తాడు పూరి. ‘బాహుబలి’కి ముందు ప్రభాస్ మార్కెట్ వేరు.. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మార్కెట్ వేరు. ఆ సినిమాకు ముందు ప్రభాస్ మీద 30-40 కోట్లకు మించి బడ్జెట్ పెట్టే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఈజీగా వంద కోట్లు పెట్టేయొచ్చు. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా బడ్జెట్ దాదాపు రూ.150 కోట్లంటున్నారు. మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రభాస్ పాతిక కోట్ల దాకా పారితోషకం తీసుకుంటున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ‘బాహుబలి: ది కంక్లూజన్’ కూడా విడుదలయ్యాక ప్రభాస్ పాపులారిటీ ఇంకా పెరుగుతుంది కాబట్టి నిలకడగా పాతిక కోట్ల పారితోషకం తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ పోయాడంటే ప్రభాస్ ఆదాయం ఏ రేంజిలో ఉంటుందో అంచనా వేయొచ్చు. అతను ప్రతి ఏడాదీ ఫోర్బ్స్ హైయెస్ట్ ఎర్న్ డ్ ఆర్టిస్టుల లిస్టులో టాప్ లో ఉండటం ఖాయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/