ఫ్యాన్‌ చెంప దెబ్బపై స్పందించిన ప్రభాస్‌

Update: 2019-08-27 05:03 GMT
'బాహుబలి' చిత్రం తర్వాత ప్రభాస్‌ కు ఇండియా వ్యాప్తంగా అభిమానులు భారీ ఎత్తున పెరిగి పోయారు. విదేశాల్లో ఉండే ఇండియన్స్‌ కూడా ప్రభాస్‌ పై అభిమానం చూపిస్తూ ఉన్నారు. ప్రభాస్‌ ఎక్కడకు వెళ్లినా కూడా అక్కడ ఫ్యాన్స్‌ చుట్టు ముడుతూనే ఉంటారు. కొన్ని నెలల క్రితం ప్రభాస్‌ ఒక ఎయిర్‌ పోర్ట్‌ కు వెళ్లిన సమయంలో అక్కడ అభిమానులు గుమ్మిగూడారు. వారు సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో ప్రభాస్‌ అలాగే నిల్చున్నాడు.

ఒక అమ్మాయి ఫొటో తీసుకుని ప్రభాస్‌ చెంపపై చిన్నగా దెబ్బ కొట్టి అక్కడ నుండి పరిగెత్తింది. ఆమె ఉత్సాహంకు అంతా ఆశ్చర్యపోయారు. అప్పట్లో ఈ విషయం పెద్ద వైరల్‌ అయ్యింది. తాజాగా ఆ విషయమై ప్రభాస్‌ 'సాహో' ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో స్పందించాడు. ఆ సమయంలో మీ ఫీలింగ్‌ ఏంటీ అంటూ ప్రశ్నించగా.. అలాంటి సంఘటనలు ప్రేమతో జరిగాయని నేను భావిస్తాను. ఆమె నాపై ప్రేమ.. అభిమానంతో ఆనందం పట్టలేక అలా చేసింది. లక్షలాది మంది ఫ్యాన్స్‌ అలాంటి అభిమానంను చూపిస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నాడు. అంతమంది ప్రేమను.. అలాంటి ప్రేమను పొందినందుకు నేను గర్వంగా ఫీల్‌ అవుతానంటూ చెప్పుకొచ్చాడు.

ప్రభాస్‌ లోని ఈ సాఫ్ట్‌ నెస్‌ అమ్మాయిలకు నచ్చుతుంది. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్‌ ఇండియాస్‌ సూపర్‌ స్టార్‌ అయ్యాడు. ఇప్పుడు సాహోతో తన క్రేజ్‌ ను మరింత పెంచుకోబోతున్నాడు. 350 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన సాహో చిత్రం ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్‌ సినీ ప్రేమికులు సాహో కోసం ఎదురు చూస్తున్నారు. సాహో విడుదల తర్వాత ప్రభాస్‌ ఫ్యాన్స్‌ సంఖ్య ఇంకా పెరగడం.. అతడిపై ప్రేమను ఇంకా ఎక్కువ చూపడం చేస్తారేమో.
Tags:    

Similar News