ఆసమ్ ఎక్స్ పీరియన్స్ అంటున్న డార్లింగ్!

Update: 2019-07-02 13:44 GMT
ప్రభాస్ 'సాహో' ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ కానుండడంతో అందరి దృష్టి ఆ సినిమాపైనే ఉంది.  'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా అనే కాకుండా.. అంతర్జాతీయ స్థాయి యాక్షన్ సీక్వెన్సులను తెరకెక్కించడం సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది.  ఇక ప్రోమోస్ ఒక్కసారిగా 'సాహో' పై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేశాయి.  ఈమధ్యే 'సాహో' టీమ్ ఆస్ట్రియాలోని బ్యూటిఫుల్ లోకేషన్స్ లో పాటల చిత్రీకరణ కూడా జరిపింది.

ఆస్ట్రియాలో షూటింగ్ ఎలా ఉందనేదానిపై ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కాసేపటి క్రితం ఒక అప్డేట్ ఇచ్చాడు. ఒక ఫోటో ను ఇన్స్టా ఖాతాద్వారా పోస్ట్ చేసి "హై డార్లింగ్స్ ఆస్ట్రియాలోని  ఇన్స్ బ్రక్.. టిరోల్ రీజియన్స్ లో షూటింగ్ చేయడం ఇప్పటివరకూ నాకున్న అద్బుతమైన అనుభవాల్లో ఒకటి." అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.  దీనికి #సినీ టిరోల్.. #మై ఇన్స్ బ్రక్.. #రాబిన్ విల్ అంటూ హ్యాష్ టాగ్స్ జోడించాడు.

ఇక ఫోటో విషయనికి వస్తే ఒక అందమైన మంచు పర్వతాలు ఉండే ప్రదేశంలో ఒక బిల్డింగ్ లో నడుస్తూ కనిపించాడు.  వైట్ టీ షర్టు.. గ్రే కలర్ బ్లేజర్.. గ్రే కలర్ టోర్న్ జీన్స్.. స్పోర్ట్స్ షూ ధరించి ఒక హాలీవుడ్ హంక్ స్టైల్ లో ఉన్నాడు.  ఈ ఫోటో పోస్ట్ చేసిన గంటకే నెటిజన్లు దాదాపు మూడు లక్షల లైకులు కొట్టడం గమనార్హం.  ఫ్యాన్స్ కామెంట్లతో రెచ్చిపోయారు.  "స్టైలిష్ రెబెల్" .. "కింగ్ ఈజ్ ఆన్ ది వే డార్లింగ్స్".. "అల్ట్రా స్టైలిష్".. "డార్లింగు..ఓ నా డార్లింగు" అంటూ రచ్చ జరిగింది.
Tags:    

Similar News