ప్రత్యేక రోజుల్లో ప్రత్యేకంగా ఉండేందుకు మీడియా కొందరి ప్రముఖులకు సంబంధించిన ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. అలానే.. రాఖీ సందర్భంగా ఒక మీడియా సంస్థ ప్రత్యేక ఇంటర్వ్యూ అచ్చేసింది. ఇంతవరకూ బయటకు పెద్దగా ఫోకస్ కాని సెలబ్రిటీల్ని రాఖీ నేపథ్యంలో బయటకు తీసుకొచ్చింది.
మీడియాకు దాదాపు దూరంగా ఉండే డార్లింగ్ ప్రభాస్ సిస్టర్స్ (సొంత కాదు పెద్దనాన్న కూతుళ్లు) సాయి ప్రసీద.. సాయి ప్రకీర్తి.. సాయి ప్రదీప్తి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ప్రభాస్ గురించి బోలెడన్ని కబుర్లు చెప్పారు. ప్రతి ఏడాది అన్నయ్య ప్రభాస్ కు ఈ ముగ్గురు సిస్టర్స్ రాఖీ తప్పనిసరిగా కడుతుంటారు. మరి.. ప్రభాస్ తో వారికున్న రిలేషన్ ను వారి వారి మాటల్లో చూస్తే..
ప్రభాస్ మాకు సొంత అన్నయ్య కాదు. కానీ.. సొంత అన్నయ్యలానే అనుకుంటాం. తను కూడా మమ్మల్ని అలానే చూస్తుంటాడు. అందరికి రెబల్ స్టార్.. మాకు మాత్రం కూల్ స్టార్. మా అన్నయ్య మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన మాకు మంచి ఫ్రెండ్. అప్పుడప్పడు బాగా టీజ్ చేస్తారు. నేనైతే ఉక్రోషం ఆపుకోలేక కొట్టేస్తుంటా. అన్నయ్య తిరగబడితే నా పరిస్థితి ఏంది? అయినా.. ఎప్పుడూ తను నవ్వుతూ ఉంటాడే కానీ.. అస్సలు రియాక్ట్ కాడు. నాకు చాక్లెట్లు అంటే బాగా ఇష్టం. వాటిని తింటూ కనిపిస్తే.. గబుక్కున లాగేసుకొని తినేసి ఆటపట్టిస్తాడు. నేను ఉక్రోషంతో ముఖం పెడితే నవ్వేస్తుంటాడు.
అన్నయ్యే అయినా గౌరవం మాత్రం ఎక్కువ. అన్నయ్యను మీరు అంటాం. కోపం వచ్చినప్పుడు మీరిలా చేయటం బాగోలేదు.. మీరు ఎందుకిలా చేశారు? అంటూ గౌరవంగా తిడుతుంటాం. చాలా కామెడీగా ఉంటుంది. మా అన్నయ్య కూడా భలే కామెడీ చేస్తారు. బయటకు బిడియంగా ఉంటారుకానీ.. ఎవరితోనైనా క్లోజ్ అయితే చాలు.. చాలా ఫ్రీగా మూవ్ అవుతారు. జోక్స్ వేస్తారు.
అన్నయ్యను మేం ఇప్పటివరకూ పొగిడింది లేదు. ఇప్పుడు అడుగుతున్నారుకాబట్టి చెబుతున్నాం. అన్నయ్య చాలా మంది హ్యుమన్ బీయింగ్. స్టార్ అన్న ఫీలింగ్ అస్సలు ఉండదు. నార్మల్ గా ఉంటారు. ఏదైనా ఓపెన్ గా మాట్లాడుతుంటారు. కుటుంబ సభ్యుల్ని సరదాగా ఆట పట్టిస్తుంటారు. నిజానికి అంత కేరింగ్ బ్రదర్ దొరకటం చాలా లక్కీ. ప్రతి ఏడాది మేం ముగ్గురం మిస్ కాకుండా రాఖీ కడతాం.
మాకు ఏం ఇష్టమో ఆలోచించి మరీ గిఫ్ట్ ఇస్తుంటారు. మా బర్త్ డే అప్పుడు కూడా మిగిలిన ఇద్దరిని అడిగి.. మాకేం ఇష్టమో తెలుసుకొని మరీ బహుమతులు ఇస్తుంటారు. షూటింగ్ లో భాగంగా వేరే దేశానికి వెళ్లినప్పుడూ గిఫ్ట్స్ ఇస్తుంటారు. అన్నయ్య ఏం కావాలంటే అది కొనుక్కోగలరు. అందుకే.. మేం అన్నయ్య కోసం స్పెషల్ గా తయారు చేసిన బహుమతుల్ని ఇస్తుంటాం.
బాగా చదువుతున్నారా? అని అడుగుతుంటారు. ఏం చేయాలనుకుంటే అది చేయండి. కానీ.. బెస్ట్ గా చేయమని చెబుతుంటారు. అమ్మానాన్నలతో కూడా మా గురించి మాట్లాడుతుంటారు. అప్పుడప్పడు షూటింగ్ స్పాట్లకు వెళుతుంటాం. బాహుబలితో అన్నయ్య ఇమేజ్ చాలా పెరిగింది. అయినా.. తను మాత్రం ఎప్పటిలానే మామూలుగా ఉన్నారు. అన్నయ్య పెళ్లి కోసం మేం చాలా అతృతగా ఎదురుచూస్తున్నాం. అన్నయ్య పెళ్లి ఫిక్స్ అయితే ఆ హడావుడి వేరు. దాని కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాం. అన్నయ్య మాత్రం షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. అన్నయ్య పెళ్లి ఫిక్స్ అయితే ఎంత బాగుండో!