ఆల్ ఇండియా స్టార్ హీరోగా ప్రస్తుతం ప్రభాస్ గుర్తింపు దక్కించుకున్నాడు. ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అన్ని కూడా దేశ వ్యాప్తంగా విపరీతమైన బజ్ ను కలిగి ఉన్నాయి. రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేస్తూ సినిమా సినిమాకు తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్న ప్రభాస్ ఎంతటి మొహమాటస్తుడో.. సిగ్గరినో అందరికి తెల్సిందే. ముఖ్యంగా అమ్మాయిల విషయానికి వచ్చేప్పటికి ప్రభాస్ పూర్తిగా ముడుచుకు పోయినట్లుగా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు కాస్త పర్వాలేదు కాని కెరీర్ ఆరంభంలో ప్రభాస్ హీరోయిన్స్ తో సన్నివేశాలు అంటే ముక్యంగా రొమాంటిక్ సన్నివేశాలు అంటే చెమటలు పట్టేలా టెన్షన్ పడేవాడట. ఇక ముద్దు సీన్ చేయాలంటే తన తండ్రి పర్మీషన్ అడిగి మరీ చేసేవాడట.
ప్రభాస్ కు అత్యంత సన్నిహితుల్లో ఒక్కడిగా పేరు దక్కించుకున్న కమెడియన్ ప్రభాస్ శ్రీను తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ అడవి రాముడు సినిమాలో ఆర్తి అగర్వాల్ తో ఒక ముద్దు సీన్ చేయాల్సి వచ్చింది. ఆ సన్నివేశంను దర్శకుడు అప్పటికప్పుడు అనుకోవడంతో ప్రభాస్ వెంటనే వెళ్లి నాన్నకు ఫోన్ చేసి ముద్దు సీన్ చేయమంటున్నారు అంటూ చెప్పి పర్మీషన్ తీసుకున్నాడట. తండ్రి అంటే గౌరవం మరియు మర్యాద కనుకే చిన్న విషయాలను కూడా తండ్రి వద్దకు తీసుకు వెళ్లి అనుమతి అడిగేవాడు అంటూ శ్రీను చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు మరియు కమిట్ అయిన సినిమా ల జాబిత చాలా పెద్దగా ఉంది. ఈయన చేస్తున్న సినిమాల విలువ దాదాపుగా మూడు వేల కోట్లు అంటే ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి స్టార్ డమ్ ఉన్న హీరో రొమాంటిక్ సీన్స్ సమయంలో ఇప్పటికి కూడా హీరోయిన్ తో కాస్త ఇబ్బంది పడుతున్నాడు అంటూ ఆయనతో వర్క్ చేసిన వారు అంటున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్ షూటింగ్ కోసం ముంబయిలో ఉన్న ప్రభాస్ త్వరలో రాధేశ్యామ్ చివరి షెడ్యూల్ లో జాయిన్ అవ్వబోతున్నాడు. ఆ తర్వాత సలార్ మూవీ ఇంకా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాను కూడా చేయాల్సి ఉంది.