ప్రభాస్ 90లోకి వెళతాడట!!

Update: 2018-06-27 05:19 GMT
కథానాయకుడు అంటే కథకు తగ్గటుగా ఉండాలని ప్రతి దర్శకుడు కోరుకుంటాడు. సినిమాలో ఉండే వెదర్ కి తగ్గట్టుగా హీరో మారితే కిక్కు మాములుగా ఉండదు. ఎక్కువగా మన హీరోలు ఇటీవల కాలంలో ఫిట్ నెస్ పై శ్రద్ధ వహిస్తున్నారు. ఒకప్పుడు ఎలాంటి కథలలో అయినా హీరోలు నార్మల్ గా కనిపించేవారు. కానీ ఇప్పుడు ప్రతి కథ కోసం కథానాయకులు వర్కౌట్స్ గట్టిగా చేసేస్తున్నారు. బాహుబలి కోసం ప్రభాస్ ఎంతగా కష్టపడ్డాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

దర్శకుడు రాజమౌళి చెప్పినట్టుగా 130 కేజీలకు పైగా కథ కోసం వర్కౌట్స్ చేశాడు. రెండు భాగాల్లో వేరే వేరుగా కనిపించాలని 130 నుంచి 150 మధ్యలో వెయిట్ ను మెయింటేన్ చేసిన రెబల్ స్టార్ సాహో కోసమని మళ్లీ కొంచెం తగ్గాడు. ఐదేళ్ల వరకు ఓకే తరహాలో ఉన్న ఈ స్టార్ హీరో ఇప్పుడు చాలా చేంజ్ అయ్యాడు. ఇకపోతే నెక్స్ట్ మరో కథ కోసం ప్రభాస్ మరింత బరువు తగ్గనున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఒక కథను ఓకే చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కథ 1930 కాలంలో సాగుతుందట.

అప్పటి వాతావరణానికి తగ్గట్టుగా ఉండాలని రెబల్ స్టార్ 90 కేజీలకు రానున్నాడట. ప్రస్తుతం సాహో సినిమాలో అసలైన సన్నివేశాలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఇక ఆలస్యం చేయకుండా మరో సినిమా కూడా స్టార్ట్ చేయాలనీ ప్రభాస్ ఆలోచిస్తున్నాడు. ప్రభాస్ సరసన పూజ హెగ్డే నటించనుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. త్వరలో సినిమా గురించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News