ప్రభాస్ ఫస్ట్ లుక్ ఇచ్చేశారు

Update: 2017-05-02 11:39 GMT
బాహుబలి ప్రభాస్ ఇప్పుడు నేషనల్ ఐకాన్ అనడంలో సందేహం అక్కర్లేదు. ఒక్క ప్రాజెక్ట్ కోసం తన నాలుగేళ్ల కెరీర్ ని ధారాధత్తం చేసినందుకు తగిన ప్రతిఫలాన్నే అందుకుంటున్న యంగ్ రెబల్ స్టార్.. ఇప్పుడు ప్రశంసల వర్షంలోను.. సక్సెస్ జోష్ లోను తడిసి ముద్దవుతూనే ఉన్నాడు. ఇలాంటి సమయంలో ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం సెన్సేషన్ అవుతోంది.

ఇప్పటికే బాహుబలి రిలీజ్ అయింది.. ప్రభాస్ నెక్ట్స్ మూవీ సాహోకు టీజర్ కూడా వచ్చేసింది.. ఇలాంటి సమయంలో మళ్లీ ఫస్ట్ లుక్ ఏంటి?.. అదే అసలు విషయం. ఈ ఫస్ట్ లుక్ సినిమాకి సంబంధించినది కాదు.. ప్రభాస్ కు ఏర్పాటు చేయబోతున్న మైనపు విగ్రహం ఫస్ట్ లుక్ ఇప్పుడు వచ్చేసింది. ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజికం వర్గాలు గతేడాది ప్రకటించి.. కొలతలు కూడా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. త్వరలో బ్యాంకాక్ లో ఏర్పాటు చేయబోతున్న ప్రభాస్ విగ్రహానికి సంబంధించిన పోస్టర్ ను.. ఇప్పుడు టుస్సాడ్స్ వర్గాలు రిలీజ్ చేశాయి.

కాలకేయుడు తలను కిరీటంతో పట్టుకుని ఈడ్చుకు వెళుతున్న స్టిల్ లో ఈ విగ్రహం ఉండనుంది. 'ఒక బాహుబలి 100 సినిమాలకు సమానం' అనే నోట్ తో బ్యాంకాక్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో బాహుబలిగా ప్రభాస్ విగ్రహం ఏర్పాటు కానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News