ఏదైనా భారీ సినిమా లేదా క్రేజీ కాంబినేషన్ సెట్స్ కెళ్లేందుకు ప్రిపేరవుతోంది అంటే ఆ సినిమాపై వచ్చే గాసిప్పులు అన్నీ ఇన్నీ కావు. వీటిలో మెజారిటీ భాగం పుకార్లు షికారు చేసేందుకే ఆస్కారం ఎక్కువ. చిత్రయూనిట్ నుంచి చిన్న పాటి లీకు దొరికినా దానిని మీడియా ఆడేసుకుంటుంది. ఇప్పుడు అలానే డార్లింగ్ ప్రభాస్ నటించే 21వ సినిమా గురించి రకరకాల ప్రచారం తామరతంపరగా వైరల్ అయిపోతోంది. అంతర్జాలంలో ఎటు చూసినా ప్రభాస్- నాగ్ అశ్విన్ జోడీ మూవీ గురించి ఆసక్తికర సమాచారం లీకవుతోంది.
ఇప్పటికే ఈ సినిమా కథాంశాన్ని నాగ్ అశ్విన్ ఎంతో యూనిక్ గా తీర్చిదిద్దారని మరో పాన్ ఇండియాకి శ్రీకారం చుట్టబోతున్నారని ప్రచారమవుతోంది. ఇక ఈ చిత్రం కోసం ది గ్రేట్ వైజయంతి అధినేత అశ్వనిదత్ ఏకంగా 300-400 కోట్ల మేర బడ్జెట్ ని వెచ్చించనున్నారని లీకులు అందుతున్నాయి. అయితే ఇందులో వాస్తవం ఎంత? అన్నది అశ్వనిదత్ స్వయంగా వెల్లడించాల్సి ఉంటుంది.
ఇక ఈ సినిమా కథాంశం గురించి రకరకాల స్పెక్యులేషన్స్ తెరపైకి వచ్చాయి. ఇదో సైన్స్ ఫిక్షన్ సినిమా అంటూ తొలుత ప్రచారమైంది. ఆ తర్వాత హిస్టారికల్ గానూ ఉంటుందని పుకార్లు షికారు చేశాయి. మరికాసేపటికే స్టెరాయిడ్స్ - మెడిసిన్ డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ యాక్షన్ మూవీ అన్న ప్రచారం వేడెక్కించింది.
తాజాగా టైమ్ మెషీన్ బ్యాక్ డ్రాప్ సినిమా అంటూ మరో పుకార్ మొదలైంది. టైమ్ మెషీన్ నేపథ్యం అనగానే తెలుగులో క్లాసిక్ మూవీ ఆదిత్య 369 గుర్తుకు వస్తుంది. బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం రెండు దశాబ్ధాల క్రితమే ఈ వండర్ ని తెరకెక్కించారు. అయితే ఆ సినిమా కథతో సంబంధం లేకుండా నేటి ట్రెండుకి తగ్గట్టు మోడ్రనైజ్డ్ స్క్రిప్టుతో లావిష్ లుక్ తో ఈ సినిమా ఉంటుందట. ఇక స్క్రీన్ ప్లేలో కాలాదులు మారుతుంటాయి. నాటి రాజుల కాలం.. నేటి మోడ్రన్ కుర్రాడి టైమ్ ని మిక్స్ చేసి రకరకాలుగా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తారట. ముందుగా టైమ్ మెషీన్ కి సంబంధించిన సీన్స్ ని గ్రీన్ మ్యాట్ లో తీయాల్సి ఉంటుంది కాబట్టి వాటి కోసం ప్రభాస్ 30 రోజుల కాల్షీట్లు కేటాయిస్తారట. రెండు పక్షాలుగా వాటిని డివైడ్ చేసి కీలకమైన సీన్లు అన్నీ తీసి సీజీ వర్క్ కి పంపిస్తారని చెబుతున్నారు. ఇక ఇది హాలీవుడ్ మూవీ తరహాలో మెజారిటీ పార్ట్ గ్రీన్ మ్యాట్ లో ఉంటుందని ప్రచారం సాగిపోతోంది. అయితే ఏది నిజం? ఏది అబద్ధం అన్నది చిత్రబృందం రివీల్ చేయాల్సి ఉంటుంది.