ఈ ఏడాది పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై సంచలన విజయం సాధించిన సినిమా ‘క్షణం’. తెలుగులో ఇలాంటి థ్రిల్లర్స్ అరుదే. తెలుగు తెరపై ఇలాంటి సినిమానా అని చూసిన జనాలంతా స్టన్నయిపోయారు. పాజిటివ్ టాక్ తో మొదలై.. ఎవరూ ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది ‘క్షణం’. రిలీజైన కొన్ని రోజుల్లోనే ఈ చిత్రానికి మూడు నాలుగు భాషల నుంచి రీమేక్ హక్కుల కోసం ఆఫర్లు వచ్చాయి. హిందీలో వశు భగ్నాని ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నాడు. ఇక తమిళంలో సత్యరాజ్ కొడుకు శిబిరాజ్.. ‘క్షణం’ రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నాడు.
‘క్షణం’ తమిళ రీమేక్ కు ‘బేతాళుడు’ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడిగా ఖరారయ్యాడు. ‘బేతాళుడు’ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించకపోయినా.. ప్రదీప్ ఎంచుకున్న కథ వైవిధ్యంగా అనిపించింది. కొన్నిచోట్ల దర్శకుడి ప్రతిభా కనిపించింది. ప్రేక్షకుల్ని కొన్ని చోట్ల బాగానే థ్రిల్ చేశాడు ప్రదీప్. అందుకే అతడికి ‘క్షణం’ దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. తెలుగులో కథానాయిక పాత్ర చేసిన ఆదా శర్మనే తమిళంలోనూ ఆ పాత్రను చేస్తోంది. ఇందులో హీరోయిన్ మరది పాత్రకు కూడా తెలుగులో చేసిన రవి వర్మనే తీసుకోవడం విశేషం. తమిళంలో తనకు ఇదే తొలి సినిమా అంటూ రవివర్మ చాలా ఎగ్జైట్ అవుతూ ట్విట్టర్లో మెసేజ్ పెట్టాడు. ఇటీవలే ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో రవి వర్మ మంచి పెర్ఫామెన్స్ ఇచ్చి ప్రశంసలు అందుకున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/