బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న `అఖండ` లో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఈ బ్యూటీ రెండవసారి కరోనా బారిన పడింది. సెకెండ్ వేవ్ ఉధృతి తగ్గినా మళ్లీ కరోనా బారిన పడటంతో ప్రగ్యా కాస్త కంగారు పడినట్లు కనిపించింది. సరిగ్గా అదే సమయంలో అఖండ టీమ్ పార్టీ ఏర్పాటు చేయడంతో..ఆ పార్టీకి ప్రగ్యా కూడా హాజరవ్వడంతో ఒక్కసారిగా `అఖండ` టీమ్ కి ముచ్చెమటలు పట్టాయి. నాకు కరోనా వచ్చింది. నాతో కలిసిన వారంతా పరీక్షలు చేసుకోండని ట్విటర్ వేదికగా ప్రగ్యా రివీల్ చేయడంతో అంతా గందరగోళానికి గురయ్యారు.
ప్రస్తుతం ప్రగ్యా హోమ్ ఐసోలేషన్ లో ఉంటూనే చికిత్స తీసుకుంటోంది. ఆరోగ్యం నిలకడగానే ఉంది. నార్మల్ గా వచ్చే జ్వరం వచ్చిపోవడం..కరోనాకి తగ్గ మందులు వేసుకుంటూ జాగ్రత్తగానే ఉంటుంది. కానీ కరోనా భయం మనిషిని వెంటాడుతూనే ఉంటుంది కదా. ఆ రకంగా ప్రగ్యా కంగారు పడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఇన్ స్టా వేదికగా దిగాలుగా ఉన్న ఓ పాత ఫోటోని పోస్ట్ చేసి ఇది నా పరిస్థితి అని చెప్పేలా తన మనసులో బాధను వ్యక్త పరిచే ప్రయత్నం చేసింది. ఐసోలేషన్ నుంచి ఎప్పుడు బయటకు వస్తానో? ఆ క్షణాల కోసం ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్నట్లు ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది.
దీంతో ప్రగ్యా ఫాలోవర్స్ త్వరగా కోలుకోవాలని..ఆరోగ్యంగా తిరిగి రావాలని దేవుళ్లను కోరుకుంటున్నారు. ఎంత కష్టమొచ్చింది. కరోనా వస్తే ఎవరి పరిస్థితి అయినా ఇదే అని భావించాలి. మనోధైర్యాన్ని కోల్పోకూడదు. మనసులోకి భయాందోళనలు రానివ్వకూడదు. సాధారణ జ్వరంగానే భావించి.. కరోనాకి తగ్గ మందులు తీసుకోవాలి. గది దాటి ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదు అన్న నిబంధన మర్చిపోకూడదు అంటూ ప్రగ్యా ఫాలోవర్స్ సూచనలు ఇస్తున్నారు. అఖండ చిత్రంతో పాటు అటు సల్మాన్ భాయ్ సినిమాలోనూ ప్రగ్య జైశ్వాల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ సరసన తదుపరి చిత్రంలో ఆఫర్ అందుకుందని ఇటీవల కథనాలొచ్చాయి.
ఎంత ఫిట్నెస్ ఫ్రీక్ అయినా కానీ..!
ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయిపోయిన ప్రగ్య మరోవైపు టాప్ బ్రాండ్లకు సంతకాలు చేస్తూ సోషల్ మీడియాల్లో ప్రచారం సాగిస్తోంది. ఈ లాక్ డౌన్ సమయాల్లో వరుస ఫోటోషూట్లతో అభిమానుల్ని అలరించింది. జిమ్ యోగా విన్యాసాలతో సోషల్ మీడియాల్లో భారీ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇటీవల ఫిట్నెస్ ఫ్రీక్ గా మారిపోయి ప్రగ్య వయసును తగ్గించేస్తూ షాక్ లిస్తోంది. రెండు లాక్ డౌన్ల మధ్య పరిశీలిస్తే ప్రగ్య వయసు తగ్గి కనిపించింది. దానికి కారణం ఈ ఖాళీ సమయాన్ని ఎంతో బాగా సద్వినియోగం చేసుకుంది. రెగ్యులర్ గా యోగా ప్రాణాయామంతో ఇది సాధ్యమైందని తెలిపింది.
కోవిడ్ కేర్ లో భాగంగా టీకాలు వేసినా అన్ని రకాలుగా హెల్త్ ప్రోటోకాల్ ను అనుసరిస్తూ.. ఫిట్‌నెస్ టిప్స్ ని పాటిస్తూ ఉండాలని తాను అలానే చేస్తున్నానని ప్రగ్య తెలిపింది. ప్రగ్యా తనను శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంచుకునే ప్రయత్నం చేసింది.. కానీ ఎంత ఫిట్నెస్ ఫ్రీక్ అయినా రెండు సార్లు ప్రగ్య కరోనా బారిన పడడం అభిమానుల్లో చర్చకు వచ్చింది.
కరోనా సోకాక ప్రగ్య మరింతగా జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపింది.
ఇప్పుడు మహమ్మారి కారణంగా.. నేను సాయంత్రం వ్యాయామం చేయడానికి సమయం కేటాయించాను అని ప్రగ్య చెప్పింది. నేను ప్రాణాయామం ఎందుకు చేయలేదని నా తల్లి నన్ను అడిగింది. ఇది ప్రారంభంలో సవాలుగా అనిపించింది. కానీ వేగంగానే ఇది ఒక అద్భుతమైన విషయం అని గ్రహించాను. ఇది నన్ను శాంతపరుస్తుంది ..నా ఆందోళనను తగ్గిస్తుంది`` అని తెలిపింది. ప్రగ్యకు శ్వాశ వ్యాయామాలు తన మామ్ నేర్పించారట.