సీనియర్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు 100కు పైగా సినిమాలను చేసి రికార్డ్ కొట్టేసిన సంగతి తెలిసిందే. యాక్షన్ రొమాంటిక్ డ్రామా కామెడీ ఇలా అన్ని తరహా కోణాలను టచ్ చేసిన ఆయన ఈ మధ్య కొంచెం సినిమాలను తగ్గించేశారు. అయితే ఆయన వారసుడిగా తనయుడు ప్రకాష్ కోవెలమూడి ఇంకా అనుకున్నంత రేంజ్ లో దర్శకుడిగా గుర్తింపు పొందడం లేదు. హీరోగా రెండు సినిమాలను చేశాడు.
అయితే అలా సెట్ అవ్వకపోవడంతో తండ్రిలాగా సినిమాలకు దర్శకత్వం వహించాలని అనుకోని మూడు సినిమాలను తెరకెక్కించాడు. కానీ ఆ సినిమాలు దారుణంగా ప్లాప్ అయ్యాయి. ముఖ్యంగా అనుష్క తో చేసిన సైజ్ జీరో ప్రయోగం చాలా నిరాశపరిచింది. అయితే మనోడి మైండ్ ఇక్కడ వర్కవుట్ కాదని ఎవరైనా చెప్పరేమో గాని బాలీవుడ్ కి షిఫ్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కథను హిందీలో చేయడానికి సిద్దమయ్యాడు.
తరగణాన్ని కూడా ప్రకాష్ గట్టిగానే పోగు చేశాడు. కంగాన రనౌత్ - రాజ్ కుమార్ మెయిన్ లీడ్ లో నటించనున్నారట. శైలేష్ సింగ్ - ఏక్తా కపూర్ సంయుక్తంగా సినిమాను నిర్మించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. మరి తెలుగులో అనగనగా ఒక ధీరుడు - సైజ్ జీరో లాంటి ప్రయోగాలు చేసిన సక్సెస్ అందుకొని ప్రకాష్ దర్శకుడిగా బాలీవుడ్ లో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.