మంచు విష్ణు ప‌నితీరుపై స్పందించిన‌ ప్ర‌కాష్ రాజ్‌!

Update: 2022-10-28 13:30 GMT
విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ మా అసోసియేష‌న్ ప‌నితీరుపై స్పందించారు. అంతే కాకుండా 'మా' అథ్య‌క్షుడు మంచు విష్ణు పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొన్ని నెలలుగా 'మా' వ్య‌వ‌హారంపై సైలెంట్ గా వుంటున్న ప్ర‌కాష్ రాజ్ తాజా స్పందించారు. 'మా' అధ్య‌క్షుడిగా మంచు విష్ణు ఎన్నికై ఏడాది కావ‌స్తున్న నేప‌థ్యంలో ప్ర‌కాష్ రాజ్ మా అసోసియేష‌న్ ప‌ని తీరుపై, అధ్య‌క్షుడు మంచు విష్ణు పై స్పందించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఏడాది క్రితం మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వికి ప్ర‌కాష్ రాజ్ పోటీకి దిగిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు పోటీగా మంచు విష్ణు త‌న ప్యాన‌ల్ తో పోటీప‌డ్డారు. ఇద్ద‌రి ప్యాన‌ల్ ల మ‌ధ్య హోరా హోరీ పోరు జ‌రిగింది. అయితే లోక‌ల్ నాన్ లోక‌ల్ వివాదం తెర‌పైకి రావ‌డంతో చాలా వ‌ర‌కు స‌భ్యులు మంచు విష్ణు వైపు మొగ్గుచూప‌డంతో ప్ర‌కాష్ రాజ్ ఓడిపోయారు. అయితే ఆయ‌న ప్యాన‌ల్ నుంచి పోటీకి దిగిన స‌భ్యులు చాలా వ‌ర‌కు విజ‌యం సాధించారు.

అయితే ప్ర‌కాష్ రాజ్ అధ్య‌క్షుడిగా ఓడిపోవ‌డం, 'మా' స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌డంతో ఆయ‌న ప్యాన‌ల్ లో పోటీచేసిన వారు కూడా రాజీనామా చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదిలా వుంటే అధ్య‌క్షుడిగా మంచు విష్ణు ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించి ఏడాది కావ‌స్తున్న నేప‌థ్యంలో ప్ర‌కాష్ రాజ్ 'మా' ప‌ని తీరుపై తాజాగా స్పందించారు. మంచు విష్ణు అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించి ఏడాది మాత్ర‌మే అవుతోంద‌న్నారు.  

ఆయ‌న ప‌ని చేశాడా?..లేదా? అనేది స‌భ్యుల‌కు తెలుసు.. ఎన్నికైన వాళ్ల‌కు బాధ్య‌త వుంటుంద‌న్నారు. ఇటీవ‌ల 'మా' కోసం చేసిన ప‌నుల‌ను ప్ర‌క‌టించారు క‌దా? అని అడిగితే.. 90 శాతం ప‌నులు చేశామ‌ని ప్ర‌క‌టించ‌డం ద్వారా అన్నీ చేసిన‌ట్టు కాద‌న్నారు.

అంతే కాకుండా మంచు విష్ణు ప‌ద‌వీ కాలం మ‌రో ఏడాది వుంద‌ని, 'మా' కోసం ఏం చేస్తారో చూద్దాం అన్నారు. అంతే కాకుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ గురించి కూడా స్ప‌ష్ట‌త‌నిచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి ఇంకా స‌మ‌యం వుంద‌ని, దాని గురించి అప్పుడు ఆలోచిస్తానన్నారు.

అయితే ప్ర‌కాష్ రాజ్ వ్యాఖ్య‌ల‌పై 'మా' అధ్య‌క్షుడు మంచు విష్ణు, ఆయ‌న ప్యానెల్‌, న‌టుడు న‌రేష్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల ప్ర‌త్యేకంగా మీడియాతో మంచు విష్ణు మాట్లాడుతూ  'మా' అధ్య‌క్షుడిగా ఇచ్చిన హామీల్ని తొంబై శాతం వ‌ర‌కు నెర‌వేర్చామ‌ని స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News