పొగిడినట్టే.. కానీ పొగడ్త కాదు

Update: 2018-03-03 04:33 GMT
కొన్ని పొగడ్తలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అవి పొగడ్తలే. కానీ వాటి వెనుక ఓ చిన్న చురక ఉంటుంది. ఓ చిన్న దెప్పిపొడుపు ఉంటుంది. అది చూశాక పొగిడినందుకు సంతోషించాలో.. కౌంటర్ పడినందుకు ఫీలవ్వాలో తేల్చుకోమంటే చాలా కష్టం. సౌత్ ఇండియా గర్వించదగ్గ నటుల్లో ఒకడైన ప్రకాష్ రాజ్ ఈ తరహా పొగడ్త లభించింది.

ప్రకాష్ రాజ్ వ్యవహార శైలిపై మొదటి నుంచి రకరకాల విమర్శలు వస్తూనే ఉన్నాయి. కాల్లీట్లు లెక్క చేయడని.. చెప్పిన టైంకు సెట్లో ఉండడని.. అతడితో పెట్టుకుంటే పని ఓ పట్టాన కదలదని.. ఇలా చాలా మాటలే వినిపిస్తాయి. ప్రకాష్ రాజ్ తాజాగా అలనాటి నటి సావిత్రి జీవితగాథగా తెరకెక్కుతున్న మహానటి సినిమాలో అప్పటి తరం ప్రొడ్యూసర్ అండ్ రైటర్ చక్రపాణి రోల్ చేస్తున్నాడు. ఈ రోల్ లో ప్రకాష్ రాజ్ ఫస్ట్ లుక్ రీసెంట్ గా రివీల్ చేశారు. ఇదే సమయంలో ప్రకాష్ రాజ్ ను పొగుడుతూనే ప్రొడ్యూసర్స్ వైజయంతి మూవీస్ వాళ్లు చిన్న చురక వేశారు. ‘‘ఆయనను సెట్లోకి తీసుకురావడం అంటే చాలా కష్టం. ఒకసారి వచ్చాడా.. క్యారవాన్ అక్కర్లేదు.. ప్లే బాక్ అవసరం లేదు.. బ్రేక్ అసలే అక్కర్లేదు’’ అంటూ నటనలో ప్రకాష్ చూపించే డెడికేషన్ ఎలాంటిదో చెప్పే ఫొటోలు రిలీజ్ చేశారు.

మహానటి సినిమాలో టైటిల్ రోల్ సావిత్రి పాత్ర కీర్తి సురేష్ చేస్తుండగా..  ఆమె భర్త జెమినీ గణేశన్ పాత్ర మళయాళ హీరో దుల్కర్ సల్మాన్ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ.. షాలినీ పాండే.. మోహన్ బాబు ఇతర ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న మహానటి మూవీ తెలుగుతోపాటు తమిళం, మళయాళ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ కానుంది
Tags:    

Similar News