కొన్ని స్నేహాలు చాలా చిత్రంగా ఉంటాయి. వీళ్లిద్దరికీ ఎక్కడ జోడీ కుదిరిందబ్బా అని ఆశ్చర్యం కలుగుతాయి. అలాంటి జంటే ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి. ఎప్పుడూ మీడియా ముందు చెప్పుకోలేదు కానీ.. వీళ్లిద్దరూ దాదాపు ప్రాణ స్నేహితుల టైపన్నమాట. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంత అభిమానమో వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులకే తెలుసు. కానీ ఎప్పుడూ ఇద్దరూ కలిసి మీడియా కంటికి కూడా కనిపించింది లేదు. ఐతే స్నేహితుల దినోత్సవం సందర్భంగా భరణిని మీకిష్టమైన, అత్యంత సన్నిహితుడైన స్నేహితుడెవరో చెప్పమంటే.. ప్రకాష్ రాజ్ పేరే చెప్పాడు. తన ఆప్త మిత్రుడితో తన అనుబంధం గురించి తొలిసారి మీడియాతో పంచుకున్నాడు.
‘‘మృగం సినిమా షూటింగ్ లో తొలిసారి ప్రకాష్ రాజ్ ను చూశా. చూడగానే వీడెవడ్రా ఇంత పొగరుగా ఉన్నాడు అనుకున్నా. కానీ తర్వాతి రోజుల్లో నా అభిప్రాయం ఎంత తప్పో అర్థమైంది. ఎంత సంపాదించినా మధ్యతరగతిలోని మాధుర్యాన్ని అతను మరిచిపోలేదు. తన వంట తనే చేసుకోవడానికి, తన బట్టలు తనే ఉతుక్కోవడానికి ఇష్టపడతాడు. అచ్చు నేను కూడా అంతే. గంగోత్రి సినిమా సమయంలో నాకో ఆపరేషన్ జరిగింది. అప్పుడు పదకొండు రోజుల పాటటు అన్నం, కూుర, పచ్చడీ అన్నీ స్వయంగా వండి తీసుకొచ్చి తోడబుట్టిన వాడిలా చూసుకున్నాడు. అందుకే శబ్బాష్ రా శంకరా పుస్తకానికి ముందు ‘ఆత్మబంధువుకి అకారణంగా..’ అంటూట ప్రకాష్ ను ఉద్దేశించి రాశా. ప్రకాష్ నిరంతర చైతన్యం. చేతుల్లోంచి వదులుకోలేం, అలాగని దగ్గర పెట్టుకోలేం.’’ అంటూ తనదైన శైలిలో చెప్పారు భరణి.