విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఎంత విలక్షణంగా నటిస్తాడో బయట కూడా అంతే విభిన్నంగా ప్రవరిస్తుంటాడు. సామాజిక సాంస్కృతిక స్పృహ కలిగిన ఆయన ఏం చేసినా ప్రత్యేకత ఉంటుంది. ప్రజా సేవ చేయడానికి ఎప్పుడు ముందుడే ప్రకాష్ రాజ్ తనకు నచ్చని విషయాలను నిర్మొహమాటంగా ఖండిస్తుంటాడు. అది దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయినా సరే ప్రశ్నించకుండా వదిలిపెట్టడు. దేశానికి ముప్పు వాటిల్లుతుంది అని ఆయనకు అనిపిస్తే వెంటనే స్పందిస్తాడు. అందుకే ఆయనకు బెదిరింపులు కూడా ఎక్కువే వస్తుంటాయి. అయినా సరే వాటిని లెక్కచేయకుండా తనదైన పంధాలో వెళ్తుంటారు ప్రకాష్ రాజ్.
ఇదిలా ఉండగా లాక్ డౌన్ తో అన్ని కంపెనీలు, దుకాణాలు మూత పడటంతో కార్మికులు కాలి నడకన తమ సొంత ఊళ్లకు పయనమై పలు చోట్ల చిక్కుకపోయారు. అయితే వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు అనేక ఏర్పాట్లు చేశాయి. ప్రభుత్వాలతో పాటు స్వచ్చంద సంస్థలు, పలువురు ప్రముఖులు ఈ వలస కార్మికులకు కావాల్సిన ఏర్పాట్లను అందించాయి. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ కూడా వలస కార్మికుల కోసం తనవంతు సాయాన్ని అందించారు. ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా అనేక మంది వలస కూలీలకు తన వ్యవసాయ క్షేత్రంలో ఆశ్రయం అందించి వారి జీవితాలకు భరోసా కలిగించాడు. కాగా వలస కార్మికులను వాళ్ల స్వస్థలాలకు పంపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ తో పాటు వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపుతున్నారు. బీహార్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లను నడుపుతూ వలస కార్మికులను తరలిస్తున్నారు. దీంతో ప్రకాష్ రాజ్ ఫామ్ హౌజ్ లో ఉన్న వలస కార్మికులు కూడా వారి స్వస్థలాలకు బయలుదేరారు.
ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేస్తూ.. 'వలస కార్మికులను సురక్షితంగా తరలిస్తున్నందుకు కేటీఆర్ గారికి, తెలంగాణ డీజీపీ గారికి కృతజ్ఞతలు. 44 రోజుల పాటు కొంతమంది కూలీలకు నా ఫామ్ హౌస్ లో ఆశ్రయం ఇచ్చాను. వాళ్లందరూ ఇప్పుడు తనను వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. వారి జీవిత కథల నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. కష్టకాలంలో వారిని ఆదుకోగలిగిన ఒక తోటి వ్యక్తిగా నేను ఎంతో గర్వపడుతున్నాను. వాళ్లకు ఆశ్రయం ఇవ్వడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ తన ఫామ్ హౌస్ లో వారందరిని ప్రత్యేక బస్సుల ద్వారా రైల్వే స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫోటోలను కూడా ట్వీట్ లో జతపరిచారు. వలస కార్మికుల జీవితాల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.