'కింగ్' అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''వైల్డ్ డాగ్''. కొత్త దర్శకుడు అహిషోర్ సాల్మోన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2న ఈ సినిమాని థియేటర్స్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాల స్పీడ్ పెంచిన మేకర్స్.. 'వైల్డ్ డాగ్' ట్రైలర్ ని మార్చి 12న సాయంత్రం గం. 4.05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో 'వైల్డ్ డాగ్' సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ స్పెషల్ వీడియోలను వదులుతోంది. తాజాగా ఇందులో ఎన్ఐఏ ఏజెంట్ రుద్ర గౌడ్ పాత్రలో నటించిన ప్రకాష్ సుదర్శన్ కు సంబంధించిన వీడియోని విడుదల చేశారు. ఎన్ఐఏ ఏజెంట్ గా కనిపించడం కోసం యాక్షన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో డూప్ లేకుండా స్టంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రంలో కింగ్ నాగ్ 'వైల్డ్ డాగ్' టీమ్ హెడ్ గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా కనిపించనున్నాడు. ఇందులో నాగార్జునకు జోడీగా బాలీవుడ్ భామ దియా మీర్జా నటించింది. సయామీ కేర్ - అతుల్ కులకర్ణి - ఆలీ రెజా - బిలాల్ హుస్సేన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఇకపోతే 'వైల్డ్ డాగ్' చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. షానెల్ డియో సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. డేవిడ్ యాక్షన్ డైరెక్టర్ గా.. మురళి ఎస్వీ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు.
Full View