త‌ల్లైనా త‌గ్గేదేలేదు..ప్ర‌ణీత బికినీ ట్రీట్!

Update: 2022-07-18 11:30 GMT
క‌న్న‌డ బ్యూటీ ప్ర‌ణీత అందం..అభిన‌యం చూసి టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవుతుంద‌ని భావించారంతా.  ఆ త‌ర‌హాలో కొన్ని సినిమాలు చేసింది. స్టార్ హీరోల‌తో తెర‌ను పంచుకోవ‌డంతో ఆరోజు కాక‌పోతే త‌ర్వాతైనా పెద్ద స్టార్ కాకుండాపోతుందా? అని ఓ సెక్షన్  ఆడియ‌న్స్  విశ్వ‌సించారు. కానీ అది జ‌ర‌గ‌లేదు. 'బావ' సినిమాతో  లాంచ్ అయిన బ్యూటీ అటుపై ఆరేడు సినిమాలు చేసి టాలీవుడ్ నుంచి నిష్ర్క‌మించాల్సి వ‌చ్చింది.

ఎక్క‌డ నుంచైతే వ‌చ్చిందో మ‌ళ్లీ  అక్క‌డికే తిరోగ‌మ‌నం చెందాల్సి వ‌చ్చింది. మ‌ధ్య‌లో బాలీవుడ్..కోలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. కానీ మాతృభాష‌లో ద‌క్కిన గుర్తింపు ఇంకె భాష‌లో ద‌క్క‌లేదు. ఈ క్ర‌మంలో వ్యాపార వేత్త నితిన్  రాజు తో ప్రేమ‌లో ప‌డింది. కొన్నాళ్ల పాటు ప్రేమ అటుపై పెళ్లి సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఓ బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చింది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌ణీత సినిమా కెరీర్ ముగిసిన‌ట్లే అని అంతా భావించారు. పెళ్లైంది. ..పిల్ల‌కి త‌ల్లైంది ఇక కుటుంబ జీవితానికే అంకిత‌మ‌వుతుంద‌ని భావించారు. కానీ అమ్మ‌డు మ్యాక‌ప్ వేసుకోవ‌డం లో వెనుక‌డుగు వేయ‌లేదు. పెళ్లి చేసుకున్నా సినిమాల్లో కొన‌సాగింది. భ‌ర్త‌ని ఒప్పించి త‌న‌కిష్ట‌మైన రంగం వైపు  రాణించాల‌నే  కొర్కెను నెర‌వేర్చుకుంటుంది.

మ‌రోవైపు సోష‌ల్ మీడియా వేదిక‌గా సెగ‌లు త‌గ్గ‌లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్ స్టా వేదిక‌గా హాట్ ఫోటోల‌తో వెడెక్కిస్తూనే ఉంది. త‌ల్లి  అయింది కాబ‌ట్టి ఈసారైనా  ఆ వేగం త‌గ్గుతుంద‌ని  అంతా భావించారు. కానీ త‌గ్గేదేలే అంటూ దూసు కుపోతుందని తాజా ఫోటో చూస్తే అర్ధ‌మ‌వుతుంది. బీచ్ లో బికినీలో దిగిన  ఓ ఫోటో ఒక‌టిప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది.

బ్లాక్ క‌ల‌ర్ హాట్ బికినీ లో అలా వాక్ చేసుకుంటో వ‌స్తోన్న వీడియో నెట్టింట‌ వైర‌ల్ అవుతోంది. అది చూసిన నెటి జ‌నులు త‌ల్లైనా ప్ర‌ణీత ఏమాత్రం త‌గ్గ‌లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్ర‌ణీత బీచ్ అందాన్ని ఎవ‌రి స్ట్లైల్లో వాళ్లు వ‌ర్ణిస్తున్నారు. మ‌రి ఏమ‌నుకుందో ఏమో ఇంత‌లో ఆ వీడియోని ఇన్ స్టా నుంచి తొల‌గించింది. మ‌రి ఈ వీడియో పై  భ‌ర్త ..కుటుంబం నుంచి ఏవైనా అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయో ? ఏమో!
Tags:    

Similar News