కారు పల్టీలు కొడుతుంటే ప్రణీత ఏమనుకుంది?

Update: 2016-02-16 07:13 GMT
రోజు పేపర్లలో - టీవీల్లో బోలెడన్ని యాక్సిడెంట్ వార్తలు చూస్తుంటాం. కానీ వాటిని పెద్దగా పట్టించుకోం. కానీ నిజంగా మనకే యాక్సిడెంట్ జరిగితే.. ఆ సమయంలో కలిగే ఫీలింగుని మాటల్లో వర్ణించడం కష్టం. అందులోనూ పెద్దగా గాయాలేమీ తగలకుండా పెద్ద ప్రమాదంలోంచి బయటపడ్డపుడు.. ఆ అనుభూతిని వర్ణించడం చాలా కష్టం. హీరోయిన్ ప్రణీత ప్రస్తుతం అలాంటి ఫీలింగులోనే ఉంది. ఇంతకీ ఖమ్మం దగ్గర తన కారుకి యాక్సిడెంట్ జరిగిన సమయంలో ప్రణీత ఫీలింగ్ ఏంటి అన్నది ఆమె మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘కారు పల్టీ కొట్టగానే గట్టిగా అరిచాను. మనసులో మాత్రం ‘మనం చనిపోకూడదు. ఇంకా బోల్డంత జీవితం ఉంది’ అనుకుంటూ దేవుణ్ణి ప్రార్థించాను. కారు కిందపడుతున్నప్పుడు ‘దేవుడా.. దేవుడా.. ఇక్కణ్ణుంచి సీసీఎల్ మ్యాచ్‌ కి వెళ్లాలి. ఆ తర్వాత చెన్నైలో జరిగే అవార్డు ఫంక్షన్ లో నాకివ్వబోయే అవార్డు తీసుకోవాలి. చాలా పనులున్నాయి దేవుడా! దెబ్బలు తగలకూడదు. ప్రాణాలు దక్కాలి’ అని మనసులోనే అనుకున్నాను. ఆ దేవుడు నా మొర ఆలకించాడు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి సీసీఎల్ మ్యాచ్‌ లో పాల్గొని.. నేను అనుకున్నట్లుగా చెన్నై వెళ్లాను. హ్యాపీగా అవార్డు తీసుకున్నాను’’ అని చెప్పింది ప్రణీత.

 యాక్సిడెంట్ తర్వాత తన ఆలోచనల్లో మార్పు వచ్చిందని ప్రణీత చెప్పింది. ‘‘అవార్డులూ - రివార్డులూ - డబ్బూ - పేరు... వీటి కోసం పాకులాడుతాం. కానీ, ప్రాణం ముందు వీటి విలువ ఎంత అనిపించింది. అందుకే, ముందు బతికి ఉండడం ముఖ్యం... బతికినంతకాలం హాయిగా ఉండడం ముఖ్యం అని అర్థం చేసుకున్నా’’ అని ప్రణీత అభిప్రాయపడింది.
Tags:    

Similar News