`ధ‌మాకా` దెబ్బ.. గ‌ట్టిగానే డిమాండ్ చేస్తున్నాడా?

Update: 2023-01-10 01:30 GMT
కింగ్ నాగార్జున గ‌త కొంత కాలంగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. వ‌ర్మ ఏ ముహూర్తాన నాగార్జునతో `ఆఫీస‌ర్` మూవీని మొద‌లు పెట్టాడో కానీ ఆ సినిమా నుంచి నాగ్ కు వ‌రుస ఫ్లాపులు వెంటాడుతున్నాయి. నాలుగు ఫ్లాపుల త‌రువాత గ‌త ఏడాది ప్రారంభంలో `బంగార్రాజు`తో ఫ‌ర‌వాలేద‌నిపించాడు. అయితే ఈ మూవీ త‌రువాత మ‌ళ్లీ ఫ్లాపుల బాట ప‌ట్టిన విష‌యం తెలిసిందే. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో చేసిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ది ఘోస్ట్‌` ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌లేక‌పోయింది.

ఈ నేప‌థ్యంలో కింగ్ నాగార్జున త‌న వంద సినిమాని ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించి స్టోరీ నుంచి ప్ర‌తీ విష‌యంలోనూ రాజీ ప‌డ‌కుండా ఈ సారి ఎలాగైనా సూప‌ర్ హిట్ ని ద‌క్కించుకోవాల‌నే ప్లాన్ లో వున్నారు. ఇందులో భాగంగానే ప‌లు స్టోరీస్ ని విన్న నాగార్జున ఫైన‌ల్ గా ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ చెప్పిన క‌థ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ రీసెంట్ గా స్టోరీ అందించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `ధ‌మాకా`. మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టించాడు.

త్రినాథ‌రావు న‌క్కిన రూపొందించిన ఈ మూవీ రీసెంట్ గా విడుద‌లై వంద కోట్ల క్ల‌బ్ లో చేరింది. ర‌చ‌యిత ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ‌తో పాటు ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన‌కు మంచి పేరుతో పాటు భారీ డిమాండ్ ని క్రియేట్ చేసింది. `ధ‌మాకా` సూప‌ర్ హిట్ తో ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ కు డిమాండ్ పెర‌గ‌డం, త‌ను చెప్పిన స్టోరీపై న‌మ్మ‌కం కుద‌ర‌డంతో త‌న‌తో సినిమాకు నాగార్జున తాజాగా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్టు తెలుస్తోంది. గ‌త కొన్ని రోజులుగా ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ నాగార్జున ఓ భారీ సినిమాకు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.

తాజాగా ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ స్టోరీ అందించిన `ధ‌మాకా` వంద కోట్ల క్ల‌బ్ లో చేర‌డంతో త‌నతో సినిమాకు నాగ్ రెడీ అవుతున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప‌నులు చ‌క చ‌కా జ‌రుగుతున్నాయిని, త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ ప్రాజెక్ట్ కు క‌థ అందించ‌డంతో పాటు ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ ఇదే మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్న విష‌యం తెలిసిందే.

అయితే `ధ‌మాకా` రిలీజ్ కు ముందు స్టోరీ, డైరెక్ష‌న్ కి క‌లిపి నాగ్ రూ. 50 ల‌క్ష‌లు ఇస్తాన‌ని క‌మిట్ అయ్యార‌ట‌. అయితే `ధ‌మాకా` మూవీ సూప‌ర్ హిట్ కావ‌డం, వంద కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ .. నాగ్ సినిమాకు రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంత వ‌ర‌కు టాలీవుడ్ రైట‌ర్స్ ద‌ర్శ‌కులుగా మారిన తొలి  సినిమాకు ఈ రేంజ్ లో డిమాండ్ చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన‌ట్టు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News