సీనియర్ హీరో రాజశేఖర్ ఫిబ్రవరి 4 న తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు కానుకగా తన కొత్త సినిమా 'కల్కి' టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడుతూ రాజశేఖర్ ఎగ్జైట్ అయ్యారు. తన లాస్ట్ ఫిలిం 'పీఎస్వీ గరుడవేగ' సినిమాకు ఎంత కొత్తగా ఫీల్ అయ్యానో 'కల్కి' సినిమాకు పనిచేసే సమయంలో కూడా అదే విధంగా ఫీలయ్యానని తెలిపారు. ప్రొడ్యూసర్ సీ. కళ్యాణ్ గారు కథలో విషయం లేకపోతే సినిమా చేయరని.. అయనకు కథ నచ్చడమే సినిమా విజయానికి మొదటి మెట్టు అని తెలిపారు.
దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమా గురించి.. రాజశేఖర్ కుటుంబం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. నిజానికి 'అ!' కంటే ముందే ఈ స్క్రిప్ట్ తో జీవితగారిని కలిశానని.. అప్పుడే సినిమా చేయాల్సిందని.. కానీ ఇప్పటికి కుదిరిందని అన్నాడు. రాజశేఖర్ గారితో నటించడం ఒక వండర్ఫుల్ ఎక్స్ పీరియెన్స్ అని.. అయన ఎప్పుడూ జోకులు వేసి నవ్విస్తుంటారని తెలిపాడు. రాజశేఖర్ ఫ్యామిలీ పై ఒక కంప్లైంట్ ఉందని.. వారు ప్రేమగా ఫుడ్ ఎక్కువ పెడతారని చెప్పాడు. రాజశేఖర్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు యాంగ్రీ స్టార్ అనే బిరుదునిస్తున్నానని తెలిపాడు. 'కల్కి' ఒక కమర్షియల్ సినిమా అని.. పాత కమర్షియల్ సూత్రాలను పాటించకుండా కొత్త కమర్షియల్ ఫార్మాట్ సృష్టించే సినిమా అని అన్నాడు. ఈ సినిమాకు ఫ్రాంచైజీ లాగా సీక్వెల్స్ చేయాలనుందని అన్నాడు. అన్నీ కుదిరితే రాజశేఖర్ గారి నెక్స్ట్ బర్త్ డేకి ఈ సినిమా సీక్వెల్ ను మొదలుపెడతామని తెలిపాడు.
నిర్మాత సీ. కళ్యాణ్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా 1980 నేపథ్యంలో సాగుతుందని చెప్పారు.. 70% షూటింగ్ పూర్తయిందని.. మిగతా సినిమాను ఏప్రిల్ లోపు కంప్లీట్ అవుతుందని తెలిపాడు. 'శేషు' తర్వాత రాజశేఖర్ గారితో చేస్తున్న సినిమా అని.. తనో చిన్న నిర్మాతగా ఉన్న సమయంలో జీవిత రాజశేఖర్ దంపతులు తనకు సపోర్ట్ గా చేశారని.. వారు తనకు కుటుంబ సభ్యులతో సమానమన్నాడు.