ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా మూడు ఫ్లాపులు ఎదురయ్యాయి. ఆ క్రమంలోనే ఆ యంగ్ హీరోలో బిగ్ డైలమా. ఈసారి ఎలాంటి కథను ఎంచుకోవాలి? ఎలాంటి దర్శకుడిని ఫైనల్ చేయాలి? అన్నది ఒకటే కన్ఫ్యూజన్. దీనికి తోడు కాంబినేషన్ ఆలోచన తనని పూర్తిగా డైలమాలోకి పడేసింది. అలా తన క్యూలో ఉన్న చాలా మంది ట్యాలెంటెడ్ దర్శకులను వెయిటింగ్ లో పెట్టేశాడట. స్క్రిప్టు రెడీ చేయమని.. ఫైనల్ స్క్రిప్టు రెడీ అయ్యాక అవకాశం రాని ఓ దర్శకుడు ఈ విషయంలో తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోవడంతో ఆ విషయం కాస్తా బయటపడింది.
ఇన్నాళ్ల వెయిటింగ్ తో ఎంతో అలసిపోయాను!! అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ నేరుగా ట్వీట్ చేయడంతో అది కాస్తా పరిశ్రమలో వైరల్ గా మారింది. `అ!` సీక్వెల్ కథను రెడీ చేసుకుని కాజల్ ని ఒప్పించి అటుపై నిర్మాత కోసం ఎంతో వేచి చూసానని యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నైరాశ్యం వ్యక్తం చేశాడు. అంతేకాదు హీరో అఖిల్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన సంగతి తాజాగా రివీలైంది.
అఖిల్ వల్ల ప్రశాంత్ కి వెయిటింగ్ తప్పలేదట. తొలుత ప్రశాంత్ వినిపించిన వేరొక కథకు ఓకే చెప్పిన అఖిల్ పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడు. దాంతో అ! సీక్వెల్ ని పక్కన పెట్టి మరీ అఖిల్ కోసం 6నెలల పాటు శ్రమించి స్క్రిప్టును రెడీ చేశాడు. తీరా ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ చేసి సెట్స్ కెళ్లొచ్చు అని భావించాడు. ఈలోగానే బొమ్మరిల్లు భాస్కర్ స్క్రిప్టును అఖిల్ ఫైనల్ చేసేయడం జీఏ2 వాళ్లకు ఓకే చెప్పేయడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇన్నాళ్లు వేచి చూసినందుకు అఖిల్ తదుపరి ఛాన్స్ అయినా ఇస్తాడా? అంటే సందేహమేనట. దీంతో ప్రశాంత్ కి నిరాశే ఎదురైంది. అఖిల్ - భాస్కర్ కాంబినేషన్ మూవీ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక హిట్టును నమ్మే పరిశ్రమలో ఆ ఒక్కటి లేకపోతే అవకాశాలు కష్టమే. ఎంత టెక్నిక్ తెలిసినా హిట్టు కొట్టి చూపించాల్సిందే. ఆ కోవలో చూసినా అఖిల్ నిర్ణయాన్ని తప్పు పట్టడం కుదరదు. అలాగని ప్రశాంత్ లా సిన్సియర్ గా ప్రయత్నించే వాళ్లకు హ్యాండివ్వడం సరికాదన్న మాటా వినిపిస్తోంది.