ఎవరూ పట్టించుకోని క్లాసిక్ రీమేక్

Update: 2019-09-23 08:32 GMT
ఏదైనా భాషలో కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న చిత్రం ఇంకో చోట రీమేక్ అయినప్పుడు దాని మీద ఆసక్తి రేగడం సహజం. కానీ మన తెలుగు ప్రస్థానం హిందీలో వెళ్తే దక్కిన ట్రీట్మెంట్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. మొన్న శుక్రవారం గద్దలకొండ గణేష్ తో పాటు ప్రస్థానం హిందీ రీమేక్ అదే టైటిల్ తో రిలీజ్ అయ్యింది.  సాయి కుమార్ పోషించిన పాత్రను సంజయ్ దత్ ముచ్చటపడి మరీ వేయగా అనుచరుడి రోల్ లో జాకీ ష్రాఫ్ కనిపించాడు.

దేవా కట్టనే దర్శకత్వ బాధ్యతలు వహించాడు. ఇంతా చేస్తే అక్కడి మెయిన్ స్ట్రీమ్ మీడియా కనీసం దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కవర్ చేసిన ఒకటి రెండు సైట్లు సైతం నెగటివ్ రివ్యూలు ఇవ్వడంతో ఎక్కడా కనీస స్థాయిలో ఓపెనింగ్స్ దక్కలేదని ట్రేడ్ టాక్. సంజయ్ దత్ లాంటి సీనియర్ స్టార్ సినిమాకు ఇలాంటి పరిస్థితి రావడం విచిత్రమే.

ఇక్కడ నిర్మాతల నిర్లక్ష్యం కూడా ఉంది. పబ్లిసిటీని గాలికి వదిలేయడంతో ఆన్ లైన్ బుకింగ్ లో చూస్తే తప్ప అసలీ సినిమా వచ్చిందన్న సంగతి సామాన్య ప్రేక్షకులకు తెలియనంత ఘోరంగా చేశారు. యాక్టివ్ గా ఉంటూ ఈవెంట్లు ఇంటర్వ్యూలు లాంటివేవీ చేయకుండా నేరుగా సినిమా రిలీజ్ చేయడంతో అడిగే నాథుడు లేకుండా పోయాడు. అందులోనూ పేరున్న యూత్ హీరో ఎవరూ లేరు. దీంతో ఎంత వేగంగా వచ్చిందో అంతకన్నా వేగంగా వెళ్లిపోయేలా ఉంది హిందీ ప్రస్థానం
Tags:    

Similar News