ప్రవీణ్ సత్తారు.. ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టాలీవుడ్. హాలీవుడ్ థ్రిల్లర్ల తరహాలో పకడ్బందీ ‘గరుడవేగ’ సినిమాను తీర్చిదిద్ది విమర్శకుల ప్రశంసలు పొందాడీ యువ దర్శకుడు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందనే ఉంది. ఇప్పటిదాకా ప్రవీణ్ చేసింది ఐదు సినిమాలైతే.. ఆ ఐదూ వేటికవే భిన్నమైన జానర్లు కావడం విశేషం. ఇప్పుడు తన ఆరో సినిమాకు మరో కొత్త జానర్ ఎంచుకున్నాడు ప్రవీణ్. ఈసారి అతను స్పోర్ట్స్ పర్సన్ బయోపిక్ తీయబోతున్నాడు. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్ జీవిత కథతో అతను సినిమా చేయబోతున్నాడు. ఇందులో సుధీర్ బాబు కథానాయకుడిగా నటించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పాడు ప్రవీణ్.
‘‘గోపీచంద్ జీవిత కథతో సినిమా చేయాలన్న ఆలోచన నాది కాదు. సుధీర్ బాబుదే. ముందు కొంచెం తటపటాయించినా.. ఆ తర్వాత గోపీచంద్ జీవితం గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాక ఆసక్తి పెరిగింది. గత కొన్ని నెలల్లో గోపీ గురించి సమాచారం కోసం అధ్యయనం చేశాం. అప్పుడు నాకెన్నో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఒక సినిమాలో మామూలుగా ఉండే మెలో డ్రామాతో పోలిస్తే.. ఆయన జీవితంలో ఇంకా చాలా డ్రామా ఉంది. బయోపిక్స్ తీసేటపుడు వాస్తవ ఘటనలకు నాటకీయతను జోడిస్తుంటాం. కానీ గోపీచంద్ జీవితం అందుకు భిన్నం. ఇందులో మామూలుగానే డ్రామా చాలా ఎక్కువ ఉంది. దాన్ని టోన్ డౌన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంత షాకింగ్ అనిపించాయి ఆయన జీవితంలోని విషయాలు. అలాగని అవేమీ నెగెటివ్ విషయాలు కాదు. అన్నీ పాజిటివే. గోపీచంద్ ఒక పాజిటివ్ పర్సన్. ఈ సినిమా చేద్దాం అనుకున్నాక నిర్మాతల కోసం ప్రయత్నించాం. ఐతే చాలామంది ఇందులో కమర్షియల్ అంశాల కోసం అడిగారు. నేను వాళ్లను వదిలేశాను. లక్కీగా ముంబయి నుంచి ఓ నిర్మాత మేం అనుకున్న తరహాలోనే సినిమా చేయడానికి ముందుకొచ్చారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో మొదలవుతుంది’’ అని ప్రవీణ్ తెలిపాడు.