నేనేం పెద్ద డైరక్టర్ అయిపోలేదు

Update: 2017-07-13 10:28 GMT
‘చందమామ కథలు’, ‘గుంటూరు టాకీస్’ సినిమాలతో ఒక మోస్తరు విజయాలు అందుకున్నాడు ప్రవీణ్‌ సత్తారు. సినిమాలు బిజినెస్ ఎలా ఉన్నా తన డైరక్షన్కు మంచి మార్కులే వచ్చాయి. ఇప్పూడు అదే నమ్మకంతో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌.ఐ.ఎ) అధికారి జీవితం నేపథ్యంలో సాగే కథగా ‘పి.ఎస్‌.వి.గరుడ వేగ 126.18ఎమ్‌’ తో మనముందుకు వస్తున్నాడు.

రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా కథను పదేళ్ళు కిందట రాసుకున్నాడట. అప్పటికి మన దేశంలో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ కూడా ప్రారంభం కాలేదు కాని.. మనోడు మాత్రం తయారుచేశాడు కథని. ఇప్పుడికీ ఈ సినిమా కోసం చాలా దేశాలు తిరగడం వలన.. సినిమాకు 25 కోట్లు ఖర్చు అయ్యింది. ''ఇంతకు ముందు నేను చాలా తక్కువ బడ్జెట్ సినిమాలు తీశాను. అప్పుడు ఆ కథలుకు ఆ బడ్జెట్ సరిపోతుంది. ఇప్పుడు గరుడ వేగకు ఈ స్థాయి బడ్జెట్ అవసరం. కథను బట్టే బడ్జెట్ ఉంటుంది కానీ డైరెక్టర్ బట్టి కాదు. నేను కథ చెప్పే విధానం, స్క్రిప్ట్ రాసుకునే పద్దతి, నా మేకింగ్ స్టైల్ అన్నీ కొత్తగా ఉంటాయి. ఈ సినిమాతో నేను ఏమి పెద్ద డైరెక్టర్ అయిపోయా అని చెప్పబోవటంలేదు. అది మీరు చూసి నాకు చెప్పాలి. మరో  చిన్న కథ దొరికితే  మళ్ళీ చిన్న సినిమా కూడా చేస్తాను'' అంటున్నాడు ప్రవీణ్‌ సత్తారు.

గరుడ వేగలో మీరు ఇంత వరకు చూసిన రాజశేఖర్‌ ను మరిచిపోతారు. అంత కొత్తగా అతని నటన ఉంటుంది. ఈ సినిమాతో రాజశేఖర్‌ నట జీవితం మరో మలుపు తిరగబోతుంది అనే అనుకుంటున్నా అంటూ ముగించాడు. ఈ సినిమా విడుదల తరువాత పుల్లెల గోపీచంద్‌ జీవితం కథను సినిమాగా  తెరకెక్కించబోతున్నాడట. స్క్రిప్టు పూర్తిస్థాయిలో సిద్ధమైంది అనికూడా చెబుతున్నాడు.
Tags:    

Similar News