స్టార్‌ కపుల్‌ తల్లిదండ్రులు కాబోతున్నారా?

Update: 2018-11-17 04:28 GMT
టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ - బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మలు గత సంవత్సరం వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెల్సిందే. చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరు గత ఏడాది కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక వీరిద్దరి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారు అనే ఆ వార్త ప్రస్తుతం బాలీవుడ్‌ వర్గాలతో పాటు దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

సాదారణంగా సెలబ్రెటీ కపుల్‌ పెళ్లి అయిన వెంటనే పిల్లలు వద్దనుకుంటారు. అయితే విరాట్‌ కోహ్లీకి పిల్లలు అంటే చాలా ఇష్టం. అందుకే పిల్లల కోసం ఆలస్యం చేయకుండా ఈ స్టార్‌ కపుల్‌ వెంటనే తల్లిదండ్రులు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా అనుష్క శర్మకు సంబంధించిన ఒక ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ ఫొటోలో అనుష్క గర్బవతి అన్నట్లుగా అనిపిస్తోంది. ఎంతో మంది కూడా ఆ ఫొటోను చూసి అనుష్క తల్లి కాబోతుందేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌ వర్గాల నుండి కూడా ఈ విషయం కాస్త అవును అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇప్పటి వరకు ఈ విషయమై అనుష్క నుండి కాని విరాట్‌ నుండి కాని ఎలాంటి క్లారిటీ రాలేదు. వారి కుటుంబ సభ్యులు కూడా ఈ విషయమై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయినా కూడా సోషల్‌ మీడియాలో విరుష్కలు తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ వార్త నిజం అయితే విరుష్క అభిమానుల ఆనందంకు హద్దు ఉండదు. కోహ్లీకి పిల్లలు అంటే ఎంత ఇష్టమో గతంలో ఆయన షేర్‌ చేసిన పిల్లల ఫొటోలను బట్టి తెలుసిపోతుంది. అతి త్వరలోనే కోహ్లీ కూడా తండ్రి కావాలని ఆయన అభిమానులు ఆశ పడుతున్నారు.

ప్రస్తుతం మీడియాలో వస్తున్న పుకార్లలో ఏ మేరకు నిజం ఉందనే విషయం తెలియాలంటే విరుష్కల్లో ఎవరో ఒకరు స్పందించాలి.

Tags:    

Similar News