బాలీవుడ్ తో పాటు సౌత్ ఆడియన్స్ కు కూడా సుపరిచితం అయిన ముద్దుగుమ్మ ప్రీతి జింటా. ఎప్పుడైతే ఈమె పంజాబ్ జట్టుకు సహ యజమాని అయ్యిందో అప్పటి నుండి ఈమె దేశ వ్యాప్తంగా మరింత పాపులారిటీని దక్కించుకుంది. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఎప్పటికప్పుడు జట్టును వెనుక ఉండి నడిపిస్తుంది. జట్టులో ఒక్క లేడీగా కనిపిస్తూ ఉంటుంది. చుక్కల మద్య చంద్రుడు వెలిగినట్లుగా ప్రీతి జింటా కూడా అంత మంది ప్లేయర్స్ మద్య ఈమె కూడా అప్పుడప్పుడు కాకుండా ఎప్పుడు మెరుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం కరోనా కారణంగా దుబాయిలో ఐపీఎల్ నిర్వహిస్తున్నారు. చాలా మంది జట్టు యజమానులు అక్కడకు వెళ్లలేదు. కాని ఈమె మాత్రం వెళ్లింది.
దుబాయిలోని బయో బబుల్ లో క్రికెటర్లతో పాటు ఈమె కూడా ఉంటుంది. బయో బబుల్ రూల్స్ గురించి ఈ అమ్మడు మాట్లాడుతూ ఒకే గదిలో ఉంటూ నాలుగు రోజులకు ఒకసారి కరోనా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 20 సార్లు పరీక్షలు చేయించుకున్నాను. బయటి వారిని ఏ ఒక్కరిని కలవకుండా జాగ్రత్తగా ఉంటూ ఐపీఎల్ లో పాల్గొంటున్న ఆటగాళ్లకు మద్దతుగా ఈమె కూడా ఉంటుంది. వారి మాదిరిగానే కఠినంగా కోవిడ్ నియమాలను పాటిస్తూ ఉంది. బయటకు వెళ్లకుండా కేవలం హోటల్ గది లేదంటే స్టేడియంలో మాత్రమే ఉంటుంది. ఇది అందరితో పాటు ఈమెకు కూడా కంటిన్యూ అవుతుంది.