ఒక్కసారి సినిమాను మొదలు పెడితే అస్సలు ఆగదనే నమ్మకంతో దర్శక నిర్మాతలు తరాల డేట్స్ ఖరారు కాకపోయినా షూటింగ్ ను మొదలు పెట్టేస్తారు. ఇక హిట్ లో ఉన్న దర్శకులైతే అనుకున్న టైమ్ కి సినిమాని కంప్లిట్ చేసి వేరే సినిమాని ప్లాన్ చేసుకుందామని అనుకుంటారు. అయితే ప్రస్తుతం హీరో మహేష్ బాబు టైమింగ్ వల్ల కొరటాల శివకి కాస్త ఒత్తిడికి లోనవుతున్నాడట.
ఎందుకంటే ఇప్పటికే మహేష్ తో భారత్ అనే నేను కథని పట్టాలెక్కించిన శివ ఆయన షెడ్యుల్ కి అనుగుణంగా రాకపోవడంతో షూటింగ్ కి బ్రేకులు పడుతున్నాయట. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా అనగా జనవరి 11న సినిమాను విడుదల చెయ్యాలని తేదీని కూడా ఖరారు చేశారు. అయితే మహేష్ రాకపోవడానికి కారణం మురగదాస్ డైరెక్షన్ లో స్పైడర్ సినిమాను త్వరగా పూర్తిచేయకోపోవడమే. మురగదాస్ కూడా ఈ సినిమా షూటింగ్ ని స్లోగా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండడంతో మహేష్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువగానే కష్టపడుతున్నాడట. ఇక స్పైడర్ సినిమా షూటింగ్ పూర్తయినా కూడా మహేష్ కొరటాల తో కలిసే ఛాన్స్ లేదు ఎందుకంటే ఆ సినిమాకి భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించనున్నారు.
దీంతో మహేష్ ప్రతి వేడుకలో పాల్గొనాలి. అందుకే కొరటాల భరత్ అను నేను సినిమా ప్రస్తుత షెడ్యూల్ ను పూర్తి చేయాలంటే రోజుకి 24 గంటలు కష్టపడాలి. త్వర త్వరగా పూర్తి చేయాలంటే దర్శకుడు స్థాయికి మించి కృషి చేయాలి. చాలా ప్రెజర్ తో కూడుకున్న పని. మరి కొరటాల అనుకున్న టైమ్ కి ప్రాజెక్ట్ ని ఎలా పూర్తి చేస్తాడో చూడాలి.