కులాల మ‌ధ్య చిచ్చు పెట్టిన అక్కీ టైటిల్

Update: 2021-12-31 09:30 GMT
ఖిలాడీ అక్ష‌య్ కుమార్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `పృథ్వీరాజ్` చిత్రం వివాదాలతో అంట‌కాగుతోంది. జ‌న‌వ‌రి 22న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాని ఆపాలి అంటూ గుర్జార్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇంత‌కీ వివాదం ఏమిటీ అన్న‌ వివ‌రాల్లోకి వెళితే.. పృథ్వీరాజ్ అస‌లు రాజ్ పుత్ కాద‌ని..గుజ్జార్స్ కి చెందిన వాడ‌ని ఆ క‌మ్యూనిటీ నాయ‌కులు వాదిస్తున్నారు. అందుకే రాజ్ పుత్ టైటిల్ తో సినిమా రిలీజ్ చేయ‌కూడాద‌ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వాద‌న నిజం కాద‌ని రాజ్ పుత్ క‌మ్యునిటీ వాదిస్తోంది. గుజ‌రాత్ నుంచి వ‌చ్చిన గౌచ‌ర్ త‌ర్వాత గుర్జార్స్  గా మారారు.

ఇప్పుడు వాళ్ల‌నే గుర్జార్స్ గా పిలుస్తున్నారు. ఇది స్థలం పేరు కానీ కులం పేరు కాద‌ని కర్ణిసేన ప్ర‌తినిధి విజ‌యేంద్ర సింగ్ షెకావ‌త్ వాదిస్తున్నారు. దీనికి కౌంటర్ గా గుర్జార్స్ నాయ‌కుడు హిమ్మ‌త్ సింగ్ స్పందించారు.  చాంద్ బ‌ద్రాయ్ రాసిన పృథ్వీరాజ్ రాసో న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ విషయాన్నిట్రైల‌ర్ చెప్పారు. గుర్జార్స్  చ‌క్ర‌వ‌ర్తి పృథ్వీరాజ్  చౌహాన్ హ‌యాంలో సంస్కృతం వాడుక‌లో ఉండేది. కానీ ఈ క‌వి ఫ్రింగల్ భాష వాడ‌లేద‌న్నారు. దీనికి ఎన్నో  చారిత్ర‌క ఆధారాలు సైతం ఉన్నాయ‌న్నారు. రాజ్ పుత్ కులాల ప్ర‌జ‌లు కూడా దీన్ని అంగీక‌రించారన్నారు.

మొత్తానికి సినిమా టైటిల్ రెండు కులాల మ‌ధ్య చిచ్చు రేపిన‌ట్లే క‌నిపిస్తోంది. పృధ్వీరాజ్ మావాడు అంటే మావాడు రెండు కులాల మ‌ద్య బిగ్ ఫైట్ న‌డుస్తోంది. అయితే బాలీవుడ్ లో ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. చ‌రిత్ర నేప‌థ్యం గ‌ల సినిమాలు రిలీజ్ స‌మ‌యంలో కుల సంఘాలు ఇలాంటి వివాదాల్ని తెర‌పైకి తీసుకొస్తాయి. `ప‌ద్మావ‌త్`..`మ‌ణిక‌ర్ణిక` రిలీజ్ స‌మ‌యంలో క‌ర్ణ సేన‌లు ఆ సినిమా రిలీజ్ లు ఆపాలంటూ డిమాండ్ చేసారు. చివ‌రిగా నిర్మాణ సంస్థ‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి వివాదాల్ని ప‌రిష్క‌రించుకుంటారు. 
Tags:    

Similar News