ఆ హీరోలతో ప్రేమపై క్లారిటీ ఇచ్చిన లీడర్‌ బ్యూటీ

Update: 2020-08-13 04:00 GMT
తెలుగు ప్రేక్షకులకు లీడర్‌ చిత్రంతో పరిచయం అయిన ప్రియా ఆనంద్‌ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. అయితే ఈమె తమిళంలో మాత్రం మంచి ఫాలోయింగ్‌ ను కలిగి ఉంది. అక్కడ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఈమెకు సినిమాలతో క్రేజ్‌ పెరగడంతో పాటు ఈమెపై పుకార్లు కూడా పట్టుకు వచ్చాయి. ఈమె మొదట యంగ్‌ హీరో అధర్వతో ప్రేమలో ఉందని ప్రచారం జరిగింది. ఆ వార్తలను ఆమె కొట్టి పారేసింది.

అధర్వ ప్రేమ వార్తు కొట్టి పారేసిన కొన్ని రోజులకే మళ్లీ కార్తీక్‌ తనయుడు గౌతమ్‌ తో ప్రేమలో మునిగి తేుతోంది అంటూ ప్రచారం మొదలయ్యింది. వారిద్దరితో ఉన్న ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్‌ అయ్యేవి. దాంతో ఈమె నిజంగానే వారిలో ఎవరితోనో ఒకరితో ప్రేమలో ఉందేమో అంటూ అంతా అనుకున్నారు. తాజాగా మరోసారి ఆ విషయమై ప్రియా ఆనంద్‌ స్పందించింది. తాను ఎవరితో ప్రేమలో లేను. గౌతమ్‌ మరియు అధర్వలు నాకు మంచి స్నేహితులు. మేము ముగ్గురం కూడా రెగ్యులర్‌ గా మాట్లాడుకుంటూ అన్ని విషయాలను చర్చించుకుంటూ ఉంటామని చెప్పింది. మరి ఇప్పుడైనా ఈ వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పడేనో చూడాలి.
Tags:    

Similar News