థ్రిల్ చేయనున్న ప్రియా వారియర్

Update: 2018-04-12 09:28 GMT
ఒక్క కన్ను గీటి దేశంలోని కుర్రకారు మొత్తాన్ని తన వలలో వేసేసుకుని.. ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిపోయింది ప్రియా వారియర్. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా విడుదల కాకుండా ఇంతటి ఇమేజ్ సంపాదించడం దాదాపుగా ఎవరికైనా అసాధ్యం అనాల్సిందే. అలాంటి ఈ బ్యూటీ నటించిన మొదటి సినిమా ఒరు అడార్ లవ్ ఇంకా విడుదల కావాల్సి ఉండగా.. ఇప్పుడీమెకు వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి.

టాలీవుడ్ లో కూడా ఈమెను దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు కానీ.. అవేవీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఓ తమిళ సినిమాకు మాత్రం ప్రియా వారియర్ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు నాలన్ కుమార స్వామి తీసే సినిమాలు ఏ స్థాయిలో జనాలను ఆకట్టుకుంటాయో తెలిసిందే. సూదుకవ్వం.. కాదలం కాదంగ పోగుం వంటి చిత్రాలను తీసిన ఈయన.. ఇప్పుడు కొత్త నటీనటులతో ఓ గ్రాండ్ మూవీ చేయాలని యోచిస్తున్నాడు. ఇందులో ప్రధాన పాత్ర కోసం ప్రియా ప్రకాష్ వారియర్ ను ఫైనల్ చేసుకున్నారని తెలుస్తుంది.

థ్రిల్లర్ జోనర్ లో రూపొందే ఈ సినిమాకు.. ఇప్పుడు స్క్రిప్టును ఫైనల్ చేస్తున్నారు. ప్రియా ప్రకాష్ తో పాటు ఇతర నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత.. ఈ థ్రిల్లర్ మూవీ గురించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.
Tags:    

Similar News