ప్రపంచ దేశాలను కరోనా (కొవిడ్-19) వైరస్ బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి వైరస్ బాధితుల సంఖ్య..మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా యూరప్ ఈ మహహ్మారికి కేంద్రంగా మారిపోయింది. ప్రస్తుతం వైరస్ ప్రభావం విలయ తాండవం చేస్తోంది. ఈ మహమ్మారి నుంచి బయట పడాలంటే ఇళ్లకి పరిమితమైతే తప్ప..మరో మార్గం లేదని అన్ని దేశాలు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసాయి. కేవలం కొన్ని ప్రదేశాలకు మాత్రం ఈ ఉత్తర్వులు అమలులో లేవు.
అయితే ప్రభాస్ అండ్ కో మాత్రం `కరోనా లేదు...గిరోనా లేదు` అన్నట్లు వ్యవరిస్తోంది. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న 20వ చిత్రం జాన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. తొలి షెడ్యూల్ ని ఇటలీలో పూర్తిచేసి.. తదుపరి హైదరాబాద్ లో ప్రత్యేక సెట్లు వేసి చిత్రీకరించారు. ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే ప్రభాస్ ముక్కుకి మాస్క్ పెట్టుకుని జార్జియా ప్లైట్ ఎక్కేసాడు. తాజాగా టీమ్ తో కమెడియిన్ ప్రియదర్శి కూడా జాయిన్ అయ్యాడు. జార్జియా చేరుకున్న అనంతరం తన జర్నీ అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. జార్జియాకు చేరుకోవడానికి మొత్తం మూడు విమానాలు మారినట్లు తెలిపాడు.
ఈ క్రమంలోనే విమానాశ్రయాలు మొత్తం బోసి పోయి ఉన్నాయని...కరోనా ఎంత ప్రభావం చూపించిందోనని అన్నాడు. ఇక షూటింగ్ కోసం యూనిట్ అహర్నిశలు శ్రమిస్తోందని అన్నాడు. అలాగే కరోనాకి తమ టీమ్ భయపడటం లేదని హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం జార్జియాలోని షూటింగ్ స్పాట్ లో 20 డిగ్రీల సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత మాత్రమే ఉందిట. ఇలాంటి టెంపరేచర్ కరోనాకు అనుకూలమైనది. అయినా తమ టీమ్ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా మానసికంగా సిద్ధమై షూటింగ్ చేస్తున్నట్లు రివీల్ చేసాడు.