విజయ్ దేవరకొండుకు 'పెళ్లి చూపులు' ఏ స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రంతోనే ప్రియదర్శి కూడా కమెడియన్ గా పరిచయం అయ్యాడు. ప్రస్తుతం ప్రియదర్శి పలు చిత్రాల్లో కమెడియన్ గా నటిస్తూ వస్తున్నాడు. తాజాగా ఈయన పద్మశ్రీ అవార్డు గ్రహీత చేనేత కార్మికుడు చింతకింద మల్లేశం పాత్రలో నటించాడు. 'మల్లేశం' అనే చిత్రంలో టైటిల్ రోల్ ను ప్రియదర్శి కనిపించబోతున్నాడు. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది.
సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను నేడు విడుదల చేశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ చిత్ర వివరాలను వెళ్లడించారు. చింతకింద మల్లేశం బయోపిక్ గా రూపొందుతున్న ఈ చిత్రం చేనేత కార్మికుల కష్టాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతుంది. తల్లి పడుతున్న కష్టం చూడలేక పోయిన చింతకింద మల్లేశం ఆసు యంత్రంను రూపొందించాడు. ఆ యంత్రం ప్రస్తుతం చేనేత పరిశ్రమనే మార్చేసింది. అందుకే మల్లేశంకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డును ఇచ్చి గౌరవించింది. ఆయన జీవితాన్ని ఈ చిత్రంలో చూపించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు. శ్రీ అధికారి నిర్మిస్తున్న ఈ చిత్రం రాజ్ ఆర్ దర్శకత్వంలో రూపొందుతోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.