బ్రహ్మానందం టాలీవుడ్ కామెడీ ముఖచిత్రం నుంచి వెళ్లిపోయి చాలా కాలమైంది. మూడేళ్లుగా ఆయనకు సినిమాలు బాగా తగ్గిపోయాయి. ఈ మధ్య ఒకటీ అరా సినిమాల్లో కనిపించినా ఆయన పాత్రలు తేలిపోయాయి. పృథ్వీ.. సప్తగిరి లాంటి కమెడియన్ల మెరుపులు కూడా ఎంతో కాలం సాగలేదు. వాళ్ల కామెడీ త్వరగా మొనాటనీ అయిపోయింది. ఇప్పుడంతా వెన్నెల కిషోర్-ప్రియదర్శిలదే హవా. కిషోర్ ప్రతి సినిమాలోనూ తన ప్రత్యేకత చాటుకుంటూ టాప్ రేంజిలో సాగుతున్నాడు. ప్రియదర్శి అతడికి దీటుగా కామెడీ పండిస్తూ.. ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గ పాత్రలతో మురిపిస్తూ సాగిపోతున్నాడు.
గత వారం ‘తొలి ప్రేమ’ సినిమాలో ప్రియదర్శి పాత్ర బాగానే వర్కవుటైంది. ఈ వారాంతంలో రిలీజైన ‘అ!’ సినిమాలో అతి పెద్ద ఆకర్షణ ప్రియదర్శితో ముడిపడ్డ సన్నివేశాలే అంటే అతిశయోక్తి లేదు. చేపగా నాని.. చెట్టుగా రవితేజలతో మాట్లాడుతూ హిలేరియస్ కామెడీ పండించాడు ప్రియదర్శి. వీళ్ల కాంబినేషన్లో వచ్చే ప్రతి సన్నివేశం నవ్వులు పూయించింది. మిగతా సినిమా అంతా సీరియస్ గా.. కొంచెం గందరగోళంగా సాగితే.. ఈ ఎపిసోడ్ మాత్రం హాయిగా.. ఆహ్లాదంగా నడుస్తుంది. నిజానికి ప్రియదర్శి ఎంత మంచి నటుడో చెప్పడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. ఎందుకంటే.. మనకు తెరమీద చేప.. చెట్టు పాత్రలు కనిపిస్తాయి. వినిపిస్తాయి. కానీ ప్రియదర్శికి అలా కాదు. అతను ఏమీ లేకుండానే.. ఏదో ఉన్నట్లు ఊహించుకుని నటించాలి. అవతలి డైలాగుకి తగ్గ హావభావాలు ఇవ్వాలి. ఇది మనం తెరపై చూసినంత సులువు కాదు. ఈ సీన్లలో ఎక్కడా కూడా ప్రియదర్శి నటన.. హావభావాలు ఎబ్బెట్టుగా అనిపించవు. నిజంగా చేపతో..చెట్టుతో అతను మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. ఇలాంటి సీన్లలోనే కదా ఒక నటుడి ప్రతిభ ఏంటో తెలిసేది. అందుకే ఇప్పుడు ‘అ!’ సినిమా గురించి మాట్లాడేవాళ్ల చర్చల్లో ప్రియదర్శి కచ్చితంగా ఉంటున్నాడు.