కొంత మంది నటులు ఉంటారే.. ఏ మాత్రం మారరు. ఏదో తమకు ఓ కేరక్టర్ వచ్చిందా.. ఇచ్చిన స్క్రిప్ట్ చదువుకున్నామా.. డెరెక్టర్ చెప్పినది చేశామా.. ప్యాకప్ చెప్పగానే బయల్దేరి వెళ్లపోయామా అన్నట్లు అస్సలు ఉండరు. ఆయా కేరక్టర్ లు నిజ జీవితంలో ఎలా ఉంటాయి? వాళ్ల బాడీ లాంగ్వేజ్ ఏంటి? మాట్లాడే భాషలో ప్రత్యేకత ఏంటి? ఇలా తెగ రీసెర్చ్ లు చేసి కష్టపడిపోతూ ఉంటారు.
దగ్గుబాటి రాణా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఘాజి చిత్రంలో సత్యదేవ్ కంచరణ - ప్రియదర్శి పులికొండలు టెక్నికల్ ఆపరేటర్ రోల్స్ చేస్తున్నారు. సోనార్ ఆపరేటర్ గా సత్యదేవ్ నటిస్తున్నాడు. 'సెట్స్ కు వెళ్లే ముందు ఆ జాబ్ కు సంబంధించిన మ్యాన్యువల్ ను డౌన్ లోడ్ చేసుకుని మొత్తం చదివాను' అంటున్నాడు సత్యదేవ్. స్క్రిప్ట్ ఉంటుందిగా.. ఎందుకిలా అంటే.. సబ్ మెరైన్ కి సోనార్ ఆపరేటర్ కన్ను లాంటి వాడు.. అందుకే అంటున్నాడీ యాక్టర్.
ఇక రేడియో ఆపరేటర్ గా ప్రియదర్శి కీలక పాత్ర పోషిస్తున్నాడు. హెడ్ ఆఫీస్ నుంచి వచ్చే సందేశాలను డీకోడ్ చేయడం, తిరిగి పంపడం ఇతని బాధ్యత. 'నేవీలో పని చేస్తున్న నా సోదరితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నా. వాళ్లు మాట్లాడే భాషేంటి, ముఖ్యంగా సమస్యలో ఉన్నపుడు వాళ్లు ఎలా స్పందించాలి'లాంటివి తెలుసుకున్నా అంటున్నాడు ప్రియదర్శి.