నిఖిల్ హీరోగా 'కుమారి 21 ఎఫ్' చిత్ర దర్శకుడు సూర్య ప్రతాప్ దర్శకత్వంలో బన్నీవాసు మరియు సుకుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా '18 పేజెస్'. ఈ సినిమా లాక్ డౌన్ కు ముందు అనుకున్నా కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు. ఇప్పుడు సినిమా షూటింగ్ కు రెడీ అవుతున్నారు. కరోనా ప్రభావం తగ్గే వరకు ఉండాలనుకున్నా అది ఎప్పుడు తగ్గేది తెలియని పరిస్థితి. కనుక వచ్చే నెలలో సినిమాను పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నారట.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పలువురు హీరోయిన్స్ ను సంప్రదించిన యూనిట్ సభ్యులు చివరకు ప్రియాంక అరుల్ మోహన్ ను ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. ఈమె తెలుగు ప్రేక్షకులకు నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో పరిచయం అయ్యింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆమెకు తెలుగులో మలి సినిమా ఆఫర్ రాలేదు. మలయాళం మరియు తమిళంలో బిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగులో మలి సినిమాకు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లే అంటున్నారు.
నటిగా ఇప్పటికే ఈమె మంచి పేరు దక్కించుకుంది. కనుక ఈ సినిమాకు ఆమె మరింత ప్లస్ అవుతుంది అంటున్నారు. నిఖిల్ ఒక సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి సమయంలో చేస్తున్నా 18 పేజెస్ సినిమా ఆయనకు సక్సెస్ ను ఇస్తుందని నమ్మకంగా ఉన్నాడట.