డిసెంబర్ ఆరంభం విదేశీ ప్రియుడు నిక్ జోనాస్ ని ప్రియాంక చోప్రా పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం ఇండియాలో దిల్లీ, ముంబై రెండు చోట్లా ఘనమైన ఆతిధ్యం ఇచ్చిన ఈ జంట ఆ తర్వాత అమెరికా- బ్రిటన్ లో విహారానికి వెళ్లారు. ప్రస్తుతం ఈ విహారంలోని వీనుల విందైన దృశ్యాల్ని పీసీ ఫ్యాన్స్ కు చేరవేస్తోంది. అక్కడ తన కుటుంబాన్ని రెగ్యులర్ గా అభిమానులకు పరిచయం చేస్తూనే ఉంది పీసీ. అందుకోసం సామాజిక మాధ్యమాల్ని ఉపయోగిస్తోంది. ప్రస్తుతం పీసీ ఇన్‌స్టాగ్రమ్ పరిశీలిస్తే.. అక్కడ రకరకాల అకేషన్స్ కి సంబంధించిన ఫోటోలు దర్శనమిస్తున్నాయి.
హబ్బీ నిక్ జోనాస్ తో తాను అత్తారింట ఎంత సంతోషంగా ఉందో ఈ ఫోటోలు చెప్పకనే చెబుతున్నాయి. నిక్ తో రొమాంటిక్ ఫోటోలతో పాటు, నిక్ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోల్ని ఇన్ స్టాగ్రమ్ లో పీసీ షేర్ చేసింది. ఈ ఫోటోల్లో నిక్ జోనాస్ తరపున బంధువులకు అందించిన శుభలేఖలు ఉన్నాయి. ఇవి ఎంతో ఖరీదైన డిజైన్స్ తో ఆకట్టుకున్నాయి.
Full View

అలాగే భర్త నిక్ జోనాస్ తో మంచు కొండల విహారాన్ని ఫోటోల్లో రివీల్ చేసింది. హబ్బీతో కలిసి తాను విజిట్ చేసిన ప్రతి ప్రదేశాన్ని ప్రూఫ్ గా ఫోటోల రూపంలో ఆవిష్కరించింది. పీసీ ఉల్లాసభరితమైన జీవితమంతా ఇన్ స్టాలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ హడావుడిలో పడి అసలు కెరీర్ గురించి ముచ్చటే లేదు. ఇప్పటి వరకూ బాలీవుడ్ లో తిరిగి నటిస్తుందా లేదా ? అన్నదానిపై క్లారిటీ లేదు. హాలీవుడ్ లో `ఏ కిడ్ లైక్ జేక్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.