గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా.. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ఇద్దరూ డిసెంబర్ లో వివాహం చేసుకొబోతున్నారనే సంగతి తెలిసిందే. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంటపై ఇండియన్ మీడియా మాత్రమే కాదు ఇంటర్నేషనల్ మీడియా ఫోకస్ భారీగా ఉంది. ఇక మనిషన్నాక ఏదో ఒక అనారోగ్యం తప్పదన్నట్టుగా ఈ ఇద్దరూ అనారోగ్యంతో బాధపడుతున్నారట.
తను ఆస్తమా పేషెంట్ అని ప్రియాంక గతంలోనే వెల్లడించింది. అస్తమాను కంట్రోల్ లో ఉంచేందుకు పేషెంట్స్ ఇన్ హేలర్స్ వాడతారు. కానీ ఈ విషయంలో కొన్ని అపోహాలు కూడా ఉన్నాయి. ఇన్ హేలర్స్ వాడొచ్చని.. అది సేఫ్ అని చెప్పే ఒక కాంపెయిన్ కు తన మద్దతు ప్రకటించిన సమయంలో ప్రియాంక తను ఐదేళ్ళ వయసునుండీ అస్తమా తో ఇబ్బంది పడుతున్నాని..కానీ సరైన మెడికేషన్ వల్ల తన చదువు.. కెరీర్ లాంటి విషయాలకు ఆస్తమా ఎప్పుడూ అడ్డు రాలేదని అప్పట్లో తెలిపింది
ఇదిలా ఉంటే తాజాగా నిక్ జోనాస్ కూడా తన అనారోగ్యం గురించి వెల్లడించాడు. చిన్నతనం నుండే తను టైప్ 1 డయాబెటిస్ తో బాధపడుతున్నానని తెలిపాడు. ఇన్స్టాగ్రామ్ లో తన చిన్నప్పటి ఫోటో ఒకటి పోస్ట్ చేసిన నిక్ "పదమూడేళ్ళ క్రితం ఇదే రోజున నాకు టైప్ 1 డయాబెటిస్ ఉందని తెలిసింది. లెఫ్ట్ లో ఉన్న ఫోటో నాకు ఆ జబ్బు ఉందని తెలిసిన కొన్నివారాల తర్వాత తీసినది. అప్పట్లో నేను 100 పౌండ్ల బరువు కూడా లేను. బ్లడ్ షుగర్ హై లో ఉండడం వల్ల అలా బరువు తగ్గాను. కుడి వైపు ఉన్న ఫోటో ఇప్పటిది. సంతోషంగా.. ఆరోగ్యంగా ఉన్నాను. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నా.. ఎక్సర్ సైజులు చేస్తున్నా.. హెల్దీ ఫుడ్ తింటున్నా.. దీంతో నా బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంది. ఇప్పుడు నాజీవితం లో ప్రతి రోజుపై నాకు ఫుల్ కంట్రోల్ ఉంది. నాకు ఈ ఆరోగ్యం విషయంలో తోడుగా నిలిచిన ఫ్యామిలీ..ఫ్రెండ్స్ అందరికీ నేను కృతజ్ఞుడిగా ఉంటాను. మీరు ది బెస్ట్ లైఫ్ గడిపేందుకు ఏది అడ్డొచ్చినా దాన్ని అధిగమించండి. ఫ్యాన్స్..మీరందిస్తున్న ప్రేమకు..సహకారానికి థ్యాంక్ యు. లవ్ యూ అల్" అంటూ ఒక ఇన్స్పైరింగ్ మెసేజ్ పెట్టాడు.