ప్రియాంక చోప్రా - నిక్‌ ల పెళ్లి విశేషాలు

Update: 2018-11-30 09:23 GMT
బాలీవుడ్‌ వర్గాలు మరియు జాతీయ మీడియా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రియాంక చోప్రా, నిక్‌ ల వివాహంకు సర్వం సిద్దం అయ్యింది. డిసెంబర్‌ 2వ తారీకున జరుగబోతున్న వివాహంకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది. పెళ్లికి సంబంధించిన మొదటి పూజను నిన్న ముంబయిలో నిర్వహించిన ప్రియాంక మరియు నిక్‌ లు నేడు పెళ్లి జరుగబోతున్న రాజస్థాన్‌ లోని జోధ్‌ పూర్‌ కు చేరుకున్నారు.

ప్రియాంక చోప్రాతో పాటు ఆమె తల్లి మరియు సోదరి పరిణితి చోప్రా ఇంకా కొందరు కుటుంబ సభ్యులు జోద్‌ పూర్‌ కు చేరుకున్నారు. ప్రియాంక మరియు నిక్‌ లు కలిసి ముంబయి నుండి జోద్‌ పూర్‌ కు అక్కడ నుండి హెలికాప్టర్‌ ద్వారా పెళ్లి జరిగే వెన్యూకు వెళ్లారు. నేడు రాత్రి జోధ్‌ పూర్‌ లో సన్నిహితులు, స్నేహితులకు ఈ జంట పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీలో అతి కొద్ది మంది ప్రముఖులు పాల్గొనబోతున్నారు. ఇక పెళ్లి కి కూడా అతి తక్కువ మందికే ఆహ్వానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

జోద్‌ పూర్‌ లో జరుగబోతున్న ఈ పెళ్లికి వివిఐపీలు వస్తున్న కారణంగా రాజస్థాన్‌ ప్రభుత్వం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎయిర్‌ పోర్ట్‌ నుండి బంధువులను మరియు స్నేహితులను వివాహ వెన్యూ వద్దకు తరలించేందుకు ఒక హెలీకాప్టర్‌ ను మూడు రోజులకు గాను బుక్‌ చేయడం జరిగిందట. పెళ్లి రెండు పద్దతుల్లో జరుగనుంది. హిందూ మరియు క్రిస్టియన్‌ మత పెద్దలు ముందు రోజు కళ్యాణ వేదిక వద్దకు చేరుకుని ఏర్పాట్లు చేయనున్నారట.

నిన్న ప్రారంభం అయిన ప్రియాంక, నిక్‌ ల వివాహ వేడుక కార్యక్రమం డిసెంబర్‌ 3 వరకు కొనసాగుతుందట. అంటే అయిదు రోజుల పాటు వీరి పెళ్లి హడావుడి ఉంటుందని బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు. పెళ్లి తర్వాత వారం రోజులకు ముంబయిలో భారీ రిసెప్షన్‌ ను వీరు ఏర్పాటు చేయబోతున్నారు. ఆ తర్వాత అమెరికాలో కూడా నిక్‌ తన సన్నిహితుల కోసం రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నాడట.

Tags:    

Similar News