బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్ధ మల్హోత్రా ప్రపోజ్ చేస్తే.. బాలీవుడ్ కం హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఓకే చెప్పేసింది. అది కూడా వేలంటైన్స్ డే రోజున కావడంతో.. ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. అయితే.. ఇదంతా నిజం కాదు లెండి. ఓ డైమండ్స్ కంపెనీ కోసం చేసిన యాడ్ షూట్ లో భాగం అన్నమాట.
ప్రియాంక వచ్చే కంటే ముందే.. ఓ రెస్టారెంట్ లో మ్యూజిక్.. ఫ్లవర్స్.. లైటింగ్ ఇలా బోలెడన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు సిద్ధార్ధ్ మల్హోత్రా. అయితే.. పీసీ రావడం రావడంతోనే చిర్రుబుర్రులాడుతూ వచ్చి.. ఇకపై యస్ అనే మాటే చెప్పనని.. అన్నిటికీ నో అనేస్తానని అంటుంది. తాను యస్ చెబితే.. తనను జనాలు ఎలా ఉపయోగించేసుకుంటున్నారో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెబుతుంది. ఇదంతా చూశాక.. తన ప్రపోజల్ విషయంలో డ్రాప్ అయిపోదామని భావిస్తాడు సిద్ధార్ధ్. జేబులో ఉన్న రింగ్ ని తడుముకుంటుంటే.. ప్రియాంక గమనించి ఏంటది అని అడుగుతుంది.
ఏం లేదంటే నువ్వు అబద్ధం చెబుతున్నావ్ నిజం చెప్పమంటుంది. దీంతో ఇక తప్పక.. తాను ముందే అనుకున్న స్టైల్ లో ఆ డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు కుర్రాడు. అప్పుడు చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ చూసి అర్ధం చేసుకున్న పిగ్గీ ఛాప్స్.. కుర్రాడి ప్రపోజల్ కి ఓకే చెప్పేస్తుంది. 'సే యస్ ఫరెవర్' అనే కాన్సెప్ట్ తో తీసిన 'నిరావ్ జోడీ' యాడ్ అందరినీ ఆకట్టుకుంటోంది.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/