హాలీవుడ్ వాళ్ళు ఒక సినిమా కోసం మిడిల్ ఆసియా నటులును వెతుకుతున్నారు. వాళ్ళకి ఒక చిన్న అలవాటు ఉంది లెండి. ఒక సినిమాలో ఒక పాత్ర పలానా ప్రాంతం వాడు చేయాలనే అనుకున్నాక సాధ్యమైనంత వరకు ఆ పాత్ర కోసం ఆ ప్రాంతం వాడినే తీసుకుంటారు. అందుకే ‘లైఫ్ ఆఫ్ పై’ కానీ ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ కానీ ముఖ్య పాత్రదారులు మన దేశం వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే కథ ఇక్కడ ప్రాంతం వాళ్ళకి సంబంధించిది కాబట్టి. ఇప్పుడు కూడా 1992లో హిటైన ‘అలాద్దీన్’ అనే యానిమేషన్ సినిమా మళ్ళీ నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో నటులు కోసం ఏడాది నుండి డైరెక్టర్ గయ్ రిచీ మరియు డిస్ని వాళ్ళు గాలింపు సాగిస్తున్నారు.
అలాద్దీన్ అనే కథలో ఒక వీది కుర్రాడు అలాగే జీనీ అనే మాంత్రికుడు సహాయంతో ఆ ప్రాంతపు యువరాణి జాస్మిన్ ను కలిసి కొన్ని సాహసాలు చేస్తారు. వాళ్ళ మధ్య ప్రేమ కథగా ఈ సినిమా ఉండబోతుంది. ఇది ఒక పర్షియన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ. ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం నటుడుని వెతకడంలో చాలా కష్టాలు పడుతున్నారట. ఈ పాత్ర చేసేవాడికి పాడటం డాన్స్ చేయటం తెలిసి ఉండాలి అనే నిబంధన కూడా పెట్టుకున్నారు. పైగా ఆ నటుడు మిడిల్ ఆసియా చెందినవాడు అవ్వాలి. అందుకని ఆ పాత్ర కోసం స్లమ్ డాగ్ మిలియనీర్ హీరో ‘దేవ్ పటేల్’ను అలాగే ‘రిజ్ అహ్మెద్’ ను పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో యువరాణి పాత్ర కోసం పవర్ రైజర్స్ ఫేమ్ ‘నామీ స్కాట్’ ను, హింది నటి ‘తార సుతారియా’ ను అనుకుంటున్నారు. కానీ ఇంకా ఎవరు అనేది ఫైనల్ కాలేదు. వాళ్ళ అనుకోవడం అటు ఉంచితే సోషల్ మీడియాలో మాత్రం ఈ పాత్ర కోసం ప్రియాంకా చోప్రాను తీసుకోవాలిసిందిగా సలహాలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే హీరోగా హృతిక్ రోశన్ ను తీసుకోమని సలహాలు ఇస్తున్నారు సోషల్ మీడియాను విరివిగా వాడే జనాలు.
యువరాణి జాస్మిన్ గా ప్రియాంకా చోప్రా అయితే బాగుంటుంది అని చాలమంది వాదిస్తున్నారు. హాలీవుడ్ కు వెళ్ళి తన మార్కెట్ ను మరింత పెంచుకున్న ప్రియాంకా ఇప్పటికే ప్రపంచ ప్రేక్షకులుకు పరిచయం అయ్యింది. డిస్ని వాళ్ళు నిర్మిస్తున్న ఈ సినిమా మార్కెట్ కూడా మిడిల్ ఆసియా లోనే ఎక్కువగా జరిగే అవకాశం ఉండవచ్చు. జాస్మిన్ పాత్ర కోసం వాళ్ళు ప్రియాంకా ను అనుకోలేదు కానీ ఇప్పుడు ఆమె క్రేజ్ చూసి ఆలోచిస్తారేమో చూడాలి.