న్యూడ్‌గా కూర్చోబెట్టి చైన్స్‌ వేశారే

Update: 2015-06-09 04:06 GMT
హాట్‌ అంటే హాట్‌ కాదు గురూ. అసలు బాలీవుడ్‌లో కాస్త ఆఫర్లు సన్నగిల్లుతున్నాయేమో అనే పరిస్థితుల్లో మూడు పదుల వయస్సు దాటిన డస్కీ బ్యూటి ప్రియాంక చోప్రా వెంటనే ఓ సూపర్‌ డెసిషన్‌ తీసుకుంది. ముందు జాగ్రత్తతో హాలీవుడ్‌కు వెళ్ళి అక్కడ కొన్ని పాటలూ వగైరా అంటూ బికినీల్లో వీడియో షూటింగ్‌లు చేస్తూ గోల గోల చేసింది. ఫలితం...

ఏముంది.. అమ్మడిని ఓ హాలీవుడ్‌ టివి ఛానల్‌ వారు ఏకంగా ఓ టివి సీరియల్‌కు హీరోయిన్‌గా తీసుకున్నారు. ఏబిసి ఛానల్‌లో ప్రసారమయ్యే ''క్వాంటికో'' సీరియల్‌లో ఇప్పుడు అమ్మడే లీడ్‌ గాళ్‌. ఇప్పటికే ట్రైలర్‌లో ఓ కారు సెక్స్‌ సీన్‌తో బీభత్సంగా ఆకట్టుకుంది. అది చాలదన్నట్లు ఇప్పుడు సింగిల్‌ ఇమేజ్‌తో కూడా సదరు ఛానల్‌ వారు ప్రచారాన్ని అదరగొట్టేస్తున్నారు.

అమ్మడు కాళ్ళకూ చేతులకూ కలిపి ఛైన్స్‌ వేసి.. ఫుల్‌ న్యూడ్‌గా కూర్చోబెట్టి.. పైనా ఎఫ్‌.బి.ఐ నేషనల్‌ అకాడమీ అనే ఓ బులుగు రంగు క్లాత్‌ను కప్పి మరీ ప్రమోట్‌ చేస్తున్నారు. ఇంత హాట్‌గా ఉన్న భామను అలా గొలుసుల్లో బంధించేసి దప్పుటి చేస్తే పాపం వీక్‌ గుండెలు ఏం కావాలి? అవి తట్టుకోలేక గట్టిగా కొట్టుకుంటున్నాయ్‌..

Tags:    

Similar News