మ‌హేష్ సినిమా కోసం పీసీ పారితోషికం అన్ని కోట్లా!

ఎస్ ఎస్ ఎంబీ 29వ చిత్రంలో గ్లోబ‌ల్ స్టార్ ప్రియాకం చోప్రా సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి జోడీగా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2025-01-29 05:45 GMT

# ఎస్ ఎస్ ఎంబీ 29వ చిత్రంలో గ్లోబ‌ల్ స్టార్ ప్రియాకం చోప్రా సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి జోడీగా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే అమ్మ‌డు హైదరాబాద్ లో ల్యాండ్ అయిన అమ్మ‌డు ముందుకుగా చిలుకూరు బాలాజీని ద‌ర్శించు కుని రంగంలోకి దిగింది. అమ్మ‌డు హైద‌రాబాద్ కి వ‌చ్చి కొన్ని సంవ‌త్స‌రాల‌వుతుంది. బాలీవుడ్ హాలీవుడ్ కి వెళ్లిన త‌ర్వాత ముంబై రావ‌డ‌మే త‌గ్గించింది. హైద‌రాబాద్ కి ఇంకెలా రాగ‌ల‌దు.

అయితే రావ‌డానికి కొన్ని సంవత్స‌రాలు ప‌ట్టినా? వ‌స్తూనే అభిమానుల హృదయాల‌ను మాత్రం చిలుకూరి టెంపుల్ కి వెళ్లి కొల్ల‌గొట్ట‌లింది. పీసీకి ఎంత భ‌క్తిశ్ర‌ద్దా? అంటూ ముచ్చ‌టించుకునేలా చేసింది. అలాగే మ‌హేష్ సినిమా కోసం అమ్మ‌డు భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటుంద‌నే విష‌యం కూడా లీకైంది. ఏకంగా ఈసినిమా కోసం అమ్మ‌డు 20 కోట్ల‌కు పైగా ఛార్జ్ చేస్తోందిట‌. గ్లోబ‌ల్ స్థాయిలో పీసీ డిమాండ్ ని బ‌ట్టి ఇంత మొత్తంలో ఛార్జ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని రాజ‌మౌళి అంత‌ర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియాని దాటి పాన్ వ‌ర‌ల్డ్ నే షేక్ చేసే కంటెంట్ తో రెడీ అయ్యారు. అందుకే ఈ సినిమా మార్కెట్ ని కూడా దృష్టి లో పెట్టుకుని పీసీ అయితే బాగుంటుం ద‌ని ఆమెని తెర‌పైకి తెచ్చారు. ప్రియాంక సినిమాలో ఉందంటే? బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ మార్కెట్ లోనూ క‌లిసొస్తుంది. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ ని మించి హాలీవుడ్ లో ఫేమ‌స్ అవుతుంది.

ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే పారితోషికం ఎక్కువైనా? పీసీ విష‌యంలో ఎక్క‌డా రాజీకి రావ‌డం లేదు. ఇంత మొత్తంలో పారితోషికం ఇంత‌వ‌ర‌కూ రాజ‌మౌళి ఏ హీరోయిన్ కి ఇవ్వ‌లేదు. అంతా తిప్పి కొడితే 10 కోట్లు లోపే తేల‌తారు. న‌టీన‌టుల బ‌డ్జెట్ విషయంలో రాజమౌళి మ‌రీ అంత స్పీడ్ గా ఉండ‌రు. వీలైనంత వ‌ర‌కూ త‌న లాజిక్ తో త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. కానీ పీసీ విష‌యంలో అలాంటి బేర‌సారాలు ఎక్క‌డా సాగిన‌ట్లు క‌నిపించ‌లేదు.

Tags:    

Similar News