హిందూ-క్రిస్టియ‌న్ స్టైల్‌ వెడ్డింగ్

Update: 2018-12-04 17:29 GMT
జోధ్‌ పూర్ ఉమైద్ భ‌వ‌న్ లో ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ పెళ్లి అంగ‌ర‌వంగ వైభ‌వంగా సాగింది. రెండ్రోజుల పాటు సాగిన ఈ వివాహ‌ వేడుక‌ను హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం, అలానే క్రిస్టియ‌న్ స్టైల్ లోనూ జ‌రుపుకున్నారు. హిందూ సాంప్ర‌దాయంలో వ‌ధూవ‌రులు స‌వ్య‌సాచి డిజైన‌ర్ దుస్తుల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ప్రియాంక చోప్రా రెడ్ డిజైన‌ర్ డ్రెస్‌లో త‌ళుక్కుమంది. పెళ్లి కొడుకు నిక్ జోనాస్ సిల్క్ ఎంబ్రాయిడ‌రీ డ్రెస్లో జమీందార్ వార‌సుడినే త‌ల‌పించాడంటే న‌మ్మండి.

క్రిస్టియ‌న్ స్టైల్ వెడ్డింగ్ లో పీసీ స్పెషల్ వైట్ అండ్ వైట్ ఛ‌మ్మీ డ్రెస్‌లో క‌నిపిస్తే నిక్ జోనాస్ సూట్‌లో ప్ర‌త్యేకంగా క‌నిపించాడు. పీసీ చేతిని ముద్దాడుతూ ఉన్న ఫోటోని రివీల్ చేశారు. రెండు సాంప్ర‌దాయాల్లో పెళ్లి వేడుక‌కు సంబంధించిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.

ఈ వేడుక ఫోటోల్ని ఎక్స్‌క్లూజివ్‌గా హ‌లో మ్యాగ‌జైన్ బ‌య‌ట‌పెట్టింది. ఈ పెళ్లి అనంత‌రం పీసీ- నిక్ జోడీ దిల్లీకి బ‌య‌ల్దేరారు. పెళ్లి త‌ర్వాత ఈ జంట విదేశాల్లోనే సెటిల‌య్యేందుకు ప్లాన్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు రూ.50కోట్ల ఖ‌రీదైన సొంత ఇల్లు కొత్త జంట కోసం రెడీగా ఉంది.
Tags:    

Similar News