ఫోటో స్టోరి: 16 ప్రాయంలో ప్రియాంక చోప్రా ఎలా ఉండేది!

Update: 2021-03-26 04:27 GMT
మాజీ ప్ర‌పంచ సుంద‌రి ప్రియాంక చోప్రా లైఫ్ జ‌ర్నీపై వ‌చ్చిన తాజా ఆటోబ‌యోగ్ర‌ఫీ- అన్ ఫినిష్డ్ సంచ‌ల‌నాలు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. త‌న లైఫ్ లో ర‌క‌ర‌కాల వివాదాలు.. క‌ల‌త‌లు.. అవ‌మానాలు.. లైంగిక వేధింపులు.. ఇలా ఎన్నో కోణాల్ని ఆ పుస్త‌కంలో ఓపెన్ అయ్యారు.

ఒకానొక స్టేజ్ లో తాను అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించేపుడు త‌న శ‌రీర అందాల్ని ట్రిమ్ చేయించుకోవాలని అమెరికా వెళ్లి క‌త్తి గాటును ఎదుర్కోవాల‌ని ఓ నిర్మాత సూచించార‌ని కూడా పీసీ వెల్ల‌డించారు. అప్ప‌ట్లోనే  స‌ర్జ‌రీలు చేయించుకుని షేపులు మార్చుకున్న మాజీ ప్ర‌పంచ సుంద‌రి అంటూ ప‌త్రిక‌లు రాసాయ‌ని కూడా వెల్ల‌డించారు.

అదంతా నిజ‌మా కాదా? అన్న‌ది అటుంచితే... 16 వ‌య‌సులో పీసీ ఎలా ఉండేది? అన్న‌దానికి ఇదిగో ఈ ఫోటోనే సాక్ష్యం. ఈ అరుదైన క్లాసిక్ డే ఫోటోని ప్రియాంక చోప్రా స్వ‌యంగా షేర్ చేయ‌గా అది అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. టీనేజర్ గా త్రోబాక్ ఫోటోని ఇలా షేర్ చేయ‌గానే అలా ల‌క్ష‌లాది లైక్ ల‌తో వైర‌ల్ గా మారింది.

38 ఏళ్ల గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఎంతో ఎదిగారు. ఎంతో సాధించారు. యుక్తవయసులో మోడలింగ్ ప్రారంభించి 18 సంవత్సరాల వయసులో మిస్ వరల్డ్ కిరీటాన్ని ద‌క్కించుకుని చ‌రిత్ర‌కెక్కారు. త‌న లైఫ్ లో ఏ ఒక్క నిజాన్ని దాచుకోకుండా ఓపెన్ అవుతున్నారు. త‌న రూపం ఇలా ఉండేది అంటూ త‌న త్రోబ్యాక్ ఫోటోని ఇప్పుడు షేర్ చేయ‌డంపై యూత్ ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు. పీసీపై కామెంట్లలో నిజం ఎంత‌?  స‌ర్జ‌రీలు నిజ‌మేనా? అస‌లు ఆ ఆరోప‌ణ‌ల్లో  నిజాలున్నాయా..! అంటూ విశ్లేషిస్తున్నారు. తాజాగా బికినీ ఫోటోని షేర్ చేయ‌డ‌మే గాక‌.. సిగ్గు! అంటే ఏమిటో విన‌నే లేదు! అన్న వ్యాఖ్య‌ను పీసీ జోడించ‌డం ఆస‌క్తిక‌రం.
Tags:    

Similar News