కాలికి గన్ను కట్టుకున్న దెయ్యం

Update: 2016-11-01 06:11 GMT
ప్రియాంక చోప్రా హాలీవుడ్ లోకి వెళ్లిపోయిందని మనకు తెలుసు. బాలీవుడ్ లో అడపాదడపా మెరుస్తున్నా అవన్నీ అప్పుడెప్పుడో అంగీకరించిన ప్రాజెక్టులే తప్ప కొత్తగా ఒప్పుకున్నవేమీ లేవు. ఇప్పటికే క్వాంటికో సీరియల్ తో యూఎస్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించేసిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. ఇప్పుడు మూవీస్ తో కూడా సత్తా చాటేందుకు సిద్ధమైపోయింది.

ఇప్పటికే బేవాచ్ మూవీలో నటిస్తుండగా.. ఇందులో విలన్ పాత్ర అయిన విక్టోరియాగా నటిస్తోంది ప్రియాంక చోప్రా. ఇప్పుడీ విక్టోరియా పాత్ర లుక్ ని విడుదల చేశారు. వన్ సైడ్ కట్ ఉన్న బ్లాక్ డ్రస్.. భయం గొలిపించే లుక్.. పెదాలకు ఒకవైపు నుంచి కారుతున్న రక్తం.. వెనక నల్లటి రెక్కలు.. వీటితో పాటు కాలికి కట్టేసి ఉన్న ఓ రివాల్వర్.. వేటాడే వ్యాంప్ కేరక్టర్ అని చెప్పడం ఇంతకంటే సింపుల్ గా సాధ్యం కాదేమో అనిపించేట్లుగా ఉంది ప్రియాంక రూపం.

'నేను మిమ్మల్ని చూస్తున్నా. అందరికీ హ్యాపీ హాలోవీన్' అంటూ తన లుక్ పై రియాక్ట్ అయింది ప్రియాంక. బేవాచ్ లో విక్టోరియా పాత్ర చేస్తున్నందుకు హ్యాపీగా ఉందన్న పీసీ.. ఆ బ్లాక్ ఈవిల్ పాజిటివ్ స్పిరిట్ గా ఉపయోగించుకునేందుకు వెనక్కు తీసుకురావడం అనే థీమ్ తనకు నచ్చిందని చెబుతోంది ప్రియాంక చోప్రా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News