స్టార్ వారసుడు ఇంత లేట్ ఏంటి..?

టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా సినీ ప్రయాణం మొదలు పెట్టాడు. మొదటి ప్రయత్నం విఫలమవగా రాఘవేంద్రరావు పర్యవేక్షణలో చేసిన పెళ్లిసందడి మెప్పించింది.

Update: 2025-02-19 06:05 GMT

టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా సినీ ప్రయాణం మొదలు పెట్టాడు. మొదటి ప్రయత్నం విఫలమవగా రాఘవేంద్రరావు పర్యవేక్షణలో చేసిన పెళ్లిసందడి మెప్పించింది. ఐతే ఆ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఇప్పటికే టాప్ లీగ్ లో కొనసాగుతుంది. పెళ్లిసందడి తర్వాత వరుస స్టార్ సినిమాలతో శ్రీలీల అదరగొట్టేసింది. ఆ సినిమా తర్వాత రోషన్ ఇప్పటివరకు ఒక్క సినిమా చేయలేదు. రోషన్ ని కూడా స్టార్ ని చేయాలని శ్రీకాంత్ కలలుకంటున్నాడు.


పెళ్లిసందడి తర్వాత అసలైతే వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ లో రోషన్ హీరోగా ఒక సినిమా అనుకున్నారు. 3 ఏళ్ల క్రితమే ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ వదిలారు. త్వరలో షూటింగ్ మొదలు అవుతుందని అనౌన్స్ చేయగా ఆ తర్వాత మేకర్స్ ఆ ప్రాజెక్ట్ ని లైట్ తీసుకున్నారు. మరి ఆ సినిమా ఎందుకు ముందుకు వెళ్లలేదు అన్నది ఎవరికీ తెలియదు. ఇక సినిమాలు లేవు కాబట్టి రోషన్ బయట కనిపించడం కూడా మానేశాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో రోషన్ ఆడుతున్నాడు. సీసీఎల్ లో తన సత్తా చాటుతున్నాడు రోషన్. సినిమాల విషయంలో రోషన్ ఎందుకు లేట్ చేస్తున్నాడు అన్నది క్లారిటీ లేదు. ఐతే ఏ సినిమా పడితే ఆ సినిమా అన్నట్టు కాకుండా సరైన సినిమాతో రావాలన్న ఆలోచనతోనే వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఐతే యువ హీరోగా రకరకాల ప్రయత్నాలు చేయాల్సిందే కానీ హిట్ సబ్జెక్ట్ కోసం ఎదురుచూస్తే రేసులో వెనకపడినట్టే అవుతుంది.

శ్రీకాంత్ సపోర్ట్ తో రోషన్ ఒక మంచి సబ్జెక్ట్ వస్తే చూడాలని అనుకుంటున్నారు ఆడియన్స్. ఐతే ఇప్పటికే రోషన్ స్టోరీ డిస్కషన్స్ చేస్తున్నాడని కాకపోతే తనకు నచ్చిన కథ దొరకట్లేదని అంటున్నారు. మరి రోషన్ నెక్స్ట్ సినిమా అప్డేట్ ఎప్పుడొస్తుంది. అది ఎవరి డైరెక్షన్ లో వస్తుంది అన్నది చూడాలి. రోషన్ తో ఒక పెద్ద బ్యానర్ చేయాలనుకున్న కథ వేరే హీరో దగ్గరకు వెళ్లిందని ఆ సినిమా మిస్ అవ్వడం వల్లే రోషన్ కాస్త అప్సెట్ లో ఉన్నాడన్న వార్తలు కూడా వినిపించాయి. ఏది ఏమైనా రోషన్ ఇలా ఖాళీగా ఉండకుండా తన సత్తా చాటే సినిమా కథ ఎంపిక చేసుకుని సినిమా తీయాలని సినీ ప్రియులు కోరుతున్నారు.

Tags:    

Similar News