'ఛావా' కి సరస్వతి శిశు మందిర్ సెల్యూట్!
ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన `'ఛావా' ఇటీవల రిలీజ్ అయి గ్రాండ్ విక్టరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన `'ఛావా' ఇటీవల రిలీజ్ అయి గ్రాండ్ విక్టరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. హిందీతో పాటు ఏక కాలంలో తెలుగు లో కూడా రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు నమోదు చేసేది. హిందీలో రిలీజ్ అయినా తెలుగు ఆడియన్స్ కి ఎంతగానో కనెక్ట్ అయింది.
ఇప్పటికే సినిమా చూసిన తెలుగు ఆడియన్స్ అంతా హిందువులంతా చూడాల్సిన సినిమా అని చాటి చెబుతున్నారు. ఇలాంటి గొప్ప సినిమాని తెలుగు భాషలోకి విడుదల చేయాలి అన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్..ఏసుబాయి పాత్రలో రష్మిక మందన్న ఆకట్టుకున్న తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తాయని..తప్పక చూడాల్సిన చిత్రమని స్వచ్ఛందంగా ప్రమోట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాని తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి లోని సరస్వతీ శిశు మందిర్ విద్యార్దినీ, విద్యార్దులు కూడా ఛావానీ వీక్షించారు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ పట్ల తమ ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నారు. థియేటర్లో శంభాజీని గౌరవిస్తూ స్టాండిగ్ ఓవేషన్ ఇచ్చారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. థియేటర్ అంతా ఆ స్కూల్ విద్యార్దుల కోసం ప్రత్యేకంగా బుక్ చేసుకున్నారు.
విద్యార్దులతో పాటు ఉపాధ్యాయులు కూడా సినిమాని వీక్షించారు. ఇలాంటి గొప్ప గౌరవం కొన్ని సినిమాలకు మాత్రమే దక్కుతుంది. అందులో ఛావా కూడా నిలిచింది. చారిత్రాత్మక నేపథ్యంగల సినిమాలు ప్రేక్షకు లకు కొత్తేం కాదు. కానీ ఆ చరిత్ర ఎంతో గొప్పగా ఉంటే తప్ప! ఇలాంటి గౌరవ మర్యాదలు దక్కవు. ఆ రకంగా ఛావా ఓ రికార్డు సృష్టించింది.