ప్రియాంక జియో అప్లికేషన్.. హల్ చల్!

Update: 2016-09-06 04:47 GMT
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియో సిమ్ కోసం ఇప్పటికే జనాలు బారులు తీతుంటే.. మరోవైపు ఓ టాప్ బాలీవుడ్ హీరోయిన్ జియో సిమ్ అప్లికేషన్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రియాంక చోప్రా కూడా జియో సిమ్ కోసం అప్లై చేసిందంటూ.. అచ్చం ఆమె ఫోటోతో ఒక దరఖాస్తు ఫామ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. కాకపోతే ఈ దరఖాస్తు ఫామ్ లో అన్ని వివరాలు ప్రియాంకవే అయినా.. సంతకం మాత్రం భిన్నంగా ఉందట.
 
సాదారణంగా ఏ మొబైల్ సిమ్ కి అప్లై చేసినా... దరఖాస్తుదారుని వివరాలు చాలా గోప్యంగా ఉంటాయి. కానీ ఒక సెలబ్రెటీకి సంబంధించిన వివరాలే ఇలా ఇంటర్నెట్ లో బ్రేకింగ్ లా అందుబాటులోకి రావడంతో హడావిడి మొదలైంది. జియో సిం కి అప్లై చేసుకున్నవారి అప్లికేషన్ సీక్రెసీ పై ప్రశ్నలు సంధిస్తున్నారు ఆమె ఫ్యాన్స్. "ప్రియాంకా.. నువ్వు జియో సిమ్ కోసం అప్లై చేశావా" అంటూ ట్వీట్ చేస్తున్నారట. అయితే టారిఫ్ లపై బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ జియో ప్లాన్ ను వివరించిన అనంతరం ముకేశ్ అంబానీని ప్రియాంక చోప్రా తెగ పొగిడేయడంతో.. ప్రియాంక ఈ సిం కి అప్లై చేసుకునే ఉంటుంది అని కొందరంటే.. అలాంటప్పుడు ఆమె అప్లికేషన్ ఇలా బయటకు రావడం ఎంత వరకూ కరెక్ట్ అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ అప్లికేషన్ ఫామ్ తో ప్రియాంక చోప్రా నిజంగా జియో సిమ్ కు అప్లై చేసిందా లేక.. అది తప్పుడు అప్లికేషనా అనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపై జియో అధికారులే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Tags:    

Similar News