కుమార్తెని ఇలా స‌గ‌మే చూపిస్తే ఎలా పీసీ?

Update: 2022-08-12 07:38 GMT
ప‌సి పిల్ల‌ల విష‌యంలో పెద్ద‌లు కొన్ని కండీష‌న్లు పెడుతుంటారు. ఆరు నెల‌లు పూర్త‌య్యే వ‌ర‌కూ పాపాయి విష‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి అని చెబుతుంటారు. ఈ క్ర‌మంలో అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప గుమ్మం దాటించ‌రు. కేవ‌లం అస‌వ‌ర‌మైన సంద‌ర్భాల్లో వైద్యం కోసం త‌ప్ప మిగిలిన స‌మ‌యాల్లో బ‌య‌ట‌కు తీసుకెళ్ల‌రు.

ఇది దేశ వ్యాప్తంగా ఉన్న ఒక‌ప్ప‌టి  విధానం.  ఒక‌ప్పుడు ఇలాంటి విష‌యాల్లో సెల‌బ్రిటీలు కూడా అంతే జాగ్ర‌త్త‌గా ఉండేవారు. బిడ్డ పుట్టిన త‌ర్వాత ఆరు నెల‌ల‌కి పాపాయిని చూపించేవారు.  కానీ నేటి డిజిట‌ల్ యుగంలో ఎన్నో మార్పులొచ్చాయి. సెల‌బ్రిటీలో చాలా ఛేంజెస్ వ‌చ్చాయి.  బేబి బంప్ లంటూ గ‌ర్భంతో ఉన్న ఫోటోల్ని నెట్టింట వ‌ద‌లుతున్నారు.

గ‌ర్భంలో పిండం  పిండం ఎలా త‌యారువుతుంద‌న్న విష‌యాలు సైతం పూసగుచ్చిన‌ట్లు చెబుతున్నారు. గ‌ర్భ స‌మ‌యంలో పిల్ల‌ల ప్రొడక్ట్ ల్ని ప్ర‌చారం చేస్తూ కోట్ల రూపాయలు వెన‌కేస్తున్నారు. ఇక  గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా స‌రోగ‌సీ విధానం ద్వారా ఓ పాప‌కి  త‌ల్లైన సంగ‌తి తెలిసిందే. అయితే ఇంత వ‌రకూ పాపాయి ముఖాన్ని చూపించ‌లేదు. కేవ‌లం పాప కాళ్లు..చేతులు.. ఉధ‌ర‌భాగాన్ని చూపించింది.

తాజాగా రాఖీ పండుగ‌ను పుర‌స్క‌రించుకుని పీసీ కుమార్తె ముఖాన్ని పాక్షికంగా చూపించింది. పాపాయి మాల్తీ మేరి ముఖం స‌గం మాత్ర‌మే క‌న‌బ‌డేలా ఓ ఫోటోని పోస్ట్ చేసింది. ఇందులో  పాప ఒక‌వైపు  చిక్ భాగాన్ని మాత్ర‌మే చూపించింది.  పెద‌వులు.. ముఖ్కు భాగం పాక్షికంగా క‌నిపిస్త‌న్నాయి. ఈ ఫోటోపై  'డేసీ గ‌ర్ల్' అనే  ట్యాగ్ ని జ‌త చేసింది.

కుమార్తె ఫోటోని ఇలా స‌గ‌మే చూపించడంతో?  అభిమానులు ఈ స‌స్పెన్స్ ఏంటో అర్ధం కాలేదంటున్నారు.  ఇంకా ఎన్నాళ్లు ఈ స‌స్ప‌న్స్... స‌గం స‌గం ప‌నులు?  కుమార్తె ముఖాన్నిప్రాంచైజీ  త‌ర‌హాలో ఒక్కో భాగాన్ని చూపించ‌డం నీకు త‌గునా? అంటూ  కామెంట్లు పెడుతున్నారు.

కుమార్తెని చూపిస్తే మేరికి దిష్టి త‌గులుతుంద‌ని ఇలా ఒక్కోసారి ఒక్కో విధంగా చూపిస్తున్నావా? అంటూ సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.  అయితే పీసీ అలాంటి యాటిట్యూడ్  ఉన్నది కాదు. పూర్తి విదేశీ సంస్కృతికి అల‌వాటు ప‌డింది. ఇలా స‌గం సగం ప‌నుల వెన‌క ఏదో క‌థ ఉంద‌న్న‌ది మ‌రికొంత  మంది వాద‌న‌.
Tags:    

Similar News